Finger Chopping Protest in Delhi|బోటని వేలు కోసుకున్న కోవూరి లక్ష్మి.. ఎందుకంటే?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఏపీలో జరుగుతున్న అక్రమాలపై గుంటూరు రూరల్‌ మండలం స్వర్ణ భారతి నగర్‌లోని కృష్ణతులసి నగర్‌ డి బ్లాక్‌ కు చెందిన కోపూరి లక్ష్మి దేశ రాజధానిలో ఆదివారం ‘ఏకలవ్య’ తరహాలో నిరసన చేపట్టారు. మాజీ…

Chiru and CM Ramesh | పవన్ కోసం చిరు పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా.. ఎందుకు ఆ వ్యాఖ్యలు వైరల్

అనకాపల్లిలో బీజేపీ తరఫున కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని రమేష్ కలిశారు. మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో మిత్రుని గెలిపించాలని చిరంజీవి కోరారు. అంతే కాకుండా ఏపీ అభివృద్ధి చెందాలంటే కూటమిని గెలిపించాలనే…

Minister Roja filed the nomination | నగిరిలో భారీగా ర్యాలీగా వెళ్లి రోజా నామినేషన్

వైసీపీ నగరి ఎమ్మెల్యే అభ్యర్థి మంత్రి రోజా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా నగిరి కొత్తపేట వినాయక ఆలయంలో పూజలు నిర్వహించి, అనంతరం ఉదయం 9: 30 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద…

Lok Sabha Polling LIVE: లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. ఓటు వేసిన ప్రముఖులు

లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఉదయాన్నే ప్రారంభమైంది. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుంది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 102 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ఉంది. దీంతోపాటు అరుణాచల్ ప్రదేశ్ తో…

kiran kumar reddy: ఆ రోజు కాళ్లు పట్టుకున్నావ్… గుర్తు లేదా పెద్దిరెడ్డి?

ఏపీలో ఎన్నికల ప్రచారం మరింత వేడిగా సాగుతోంది. నాయకులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై విరుచుకుపడ్డారు. పదవుల కోసం నా కాళ్లు పట్టుకుంది మరిచిపోయావా…

Vijayawada Fire Accident | మెడికల్ గోడౌన్స్ లో మంటలు.. హడలిపోయిన ప్రజలు

విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బందర్ రోడ్డులోని KDCC బ్యాంకు ఎదురుగా ఉన్న మెడికల్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. గాలి తీవ్రతతో గోడౌన్లలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐదు…

Janasena MLA and MP Candidates | బీ-ఫారాలు అందుకున్న జనసేన అభ్యర్థులు

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన పార్టీ దూకుడు పెంచింది. తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులకు ఈ రోజు బీ-ఫారాలు అందజేసింది. అందుకే మెుదటి బీ-ఫారం పార్టీలోని కీలక నేత నాదెండ్ల మనోహర్ అందుకున్నారు. ఈ ఈక్రమంలోనే…

TDP leader Pattabhi :రాయి దాడి ఘటనలో TDP నేతల్ని ఇరికించే ప్రయత్నం

 సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఘటనలో టీడీపీ నేతల్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆ పార్టీ నేత కొమ్మారెడ్డి పట్టాభి ఆరోపించారు. కోడికత్తి డ్రామాలాగానే ఇది కూడా జరిగే ప్రమాదం ఉందన్నారు. అమాయకులపై యువకులను విజయవాడ సీపీ క్రాంతిరాణా…

Ayodhya sri rama navami celebrations | అయోధ్య రామయ్య తొలి శ్రీరామనవమి వేడుకలు

అయోధ్యలో బాల రాముడి శ్రీరామ నవమి వేడుకలు ప్రారంభం అయ్యాయి.కొత్త రామాలయంలో తొలి రామ నవమి వేడుకల కోసం సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్దారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట జరిగిన తర్వాత జరగుతున్న శ్రీరామ నవమి వేడుకలు ఇవే కావడంతో…

KCR in Sultanpur Meeting | పోలీసులు మారకుంటే.. ప్రజలు తిరగబడే రోజు వస్తుంది

తెలంగాణ పోలీసులు మితిమీరిన పనులు చేయవద్దని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోరారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా నడిచిందో చూసుకోవాలన్నారు. పోలీసులు సోదరులు మారకుంటే ప్రజలు తిరగబడే రోజు వస్తోందని కేసీఆర్ (KCR) హెచ్చరించారు.

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు