KKR vs PBKS IPL 2024 :  ఐపీఎల్​ 2024లో నెక్ట్స్​ ఏంటి? 300 కొట్టేస్తారా? 350 కూడా వెళుతుందా? బ్యాటర్లు 200 కొట్టడం ఖాయమేనా? 25 బాల్స్​లో సెంచరీలను చూస్తామా? ఒకప్పుడు.. ఊహకు అందని ఈ స్కోర్లు.. ఈ ఐపీఎల్​ సీజన్​లో బ్యాటర్ల విధ్వంసం చూస్తుంటే.. అసాధ్యం అనిపించడం లేదు! ఇక శుక్రవారం కోల్​కతా నైట్​ రైడర్స్​ 261 రన్స్​ కొట్టడం ఒకెత్తైతే.. ఆ టార్గెట్​ని 8 బాల్స్​ మిగిలి ఉండగానే పంజాబ్​ కింగ్స్​ ఛేజ్​ చేసి పడేయడం మరో ఎత్తు! ఇలా రికార్డు స్థాయి స్కోర్లు నమోదవుతుండటం.. ఫ్యాన్స్​కి వినోదాన్ని అందిస్తున్నా, చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్​ అంటేనే బ్యాట్​కి బాల్​కి మధ్య పోటీ అని.. కానీ ఇప్పుడు బౌలర్లు అల్లాడిపోతున్నారని అభిప్రాయపడుతున్నారు. కేకేఆర్​ వర్సెస్​ పంజాబ్​ కింగ్స్​ మ్యాచ్​ తర్వాత.. ‘వరస్ట్​ ఐపీఎల్​’ ట్విట్టర్​లో ట్రెండింగ్​లోకి వచ్చింది. బౌలర్లను కాపాడండి అంటూ.. స్పిన్నర్​ అశ్విన్​ పోస్ట్​ చేశాడు.

ఐపీఎల్​ 2024లో బాదుడే బాదుడు..!

ఒకప్పుడు 180 స్కోరంటేనే చాలా ఎక్కువ అనిపించేది. టీమ్స్​ ప్రశాంతంగా ఉండేవి. కానీ ఇప్పుడు.. 200 టార్గెట్​ కూడా సరిపోవడం లేదు. 200 దాటినా.. టీమ్స్​లో ఆందోళన! ఐపీఎల్​ 2024 స్టాట్స్​ చూస్తుంటే.. ఇది స్పష్టంగా తెలుస్తోంది. గత 12 ఐపీఎల్​ మ్యాచుల్లో.. 12సార్లు 200 రన్స్​ స్కోర్​ నమోదైంది. ఈ సీజన్​లో 250 స్కోర్​ ఏకంగా 7సార్లు దాటింది.

దీనిపై స్పిన్నర్​ అశ్విన్​ స్పందించాడు.

IPL 2024 records : “ఎవరైనా దయచేసి బౌలర్లను కాపాడండి. అర్జెంట్​, ఎస్​ఓఎస్​. టీ20 గేమ్, 260+ స్కోర్​ ఛేజింగ్​లో​ చివరి 2 ఓవర్లలో బాల్​కి రన్​ వచ్చింది,” అని పోస్ట్​ చేశాడు అశ్విన్​.

అశ్విన్​ ఒక్కడే కాదు.. చాలా మంది బౌలర్ల ఇదే అభిప్రాయపడుతున్నారు. ఆర్సీబీ పేసర్​ మహమ్మద్​ సిరాజ్​ సైతం.. కొన్ని రోజుల క్రితం ఇదే విధంగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. లెజెండరీ క్రికెటర్​ సునీల్​ గవాస్కర్​ కూడా చెప్పింది ఇదే! బ్యాట్​కి బాల్​కి మధ్య పోటీ లేకపోతే.. ఏదో ఒక రోజు క్రికెట్​ క్రేజ్​ పడిపోతుందని ఆయన అన్నాడు.

ఫ్లాట్​ వికెట్లతో పాటు ఇంపాక్ట్​ ప్లేయర్​ రూల్​.. బౌలర్స్​ని చాలా ప్రభావితం చేస్తోంది. ఇదే విషయంపై ట్విట్టర్​లో వరస్ట్​ ఐపీఎల్​ అన్న హ్యాష్​ట్యాగ్​ ట్రెండ్​ అవుతోంది.

“ఇది వరస్ట్​ ఐపీఎల్​. బాల్​కి బ్యాట్​కి మధ్య బ్యాలెన్స్​ లేదు. ఇండియాకు మంచి బౌలర్లు రాకపోయినా బీసీసీఐ బాధపడదు. బ్యాటింగ్​ ప్యారడైజ్​లో బ్యాట్స్​మన్​ ఇన్నింగ్స్​ని ఎలా సెలబ్రేట్​ చేసుకుంటారు? ఫ్లాట్​ ట్రాక్స్​పై విరుచుకుపడేవారికి మంచి పిచ్​ ఇస్తే.. అప్పుడు తెలుస్తుంది,” అని ఓ నెటిజన్​ కామెంట్​ చేశారు.

“గత 12 రోజుల్లో 12సార్లు 200 ప్లస్​ స్కోర్​ దాటింది. ఐపీఎల్​ చరిత్రలో ఇదే వరస్ట్​ ఐపీఎల్​ అవుతుందా?” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.

Worst IPL 2024 : “టీ20ల్లో 40 సిక్సులా? వరస్ట్​, వరస్ట్​ ఐపీఎల్​” అని ఇంకొకరు పేర్కొన్నారు.

“ఐపీఎల్​కి పాకిస్థాన్​ సూపర్​ లీగ్​కి మధ్య తేడా లేకుండా పోయింది. వరస్ట్​ ఐపీఎల్​ సీజన్​,” అని మరో వ్యక్తి చెప్పుకొచ్చారు.