Pbks Records: ఐపీఎల్‌లోనే కాదు టీ20 క్రికెట్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్‌ సంచ‌ల‌నం సృష్టించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. కోల్‌క‌త్ విధించిన 261 ప‌రుగుల భారీ స్కోరును మ‌రో ఎనిమిది బాల్స్ మిగిలుండ‌గానే ఛేదించి రికార్డులు సృష్టించింది. పంజాబ్ బ్యాట‌ర్ల‌లో బెయిర్ స్టో సెంచ‌రీతో చెల‌రేగ‌గా…శ‌శాంక్‌సింగ్‌, ప్ర‌భ్‌సిమ్రాన్ ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్‌ల‌తో అద‌ర‌గొట్టి పంజాబ్‌కు అద్భుత విజ‌యాన్ని అందించారు. భారీ టార్గెట్‌ను ఛేదించిన పంజాబ్ ఈ మ్యాచ్ ద్వారా ఐపీఎల్‌లో ప‌లు అరుదైన రికార్డులును నెల‌కొల్పింది. ఆ రికార్డులు ఏవంటే?

హయ్యెస్ట్ ఛేజింగ్…

ఐపీఎల్‌తో పాటు టీ20 క్రికెట్‌లో హ‌య్యెస్ట్ ఛేజింగ్ ఇదే. 2022 ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌పైనే రాజ‌స్థాన్ 224 ప‌రుగుల్ని ఛేదించి రికార్డ్ నెల‌కొల్పింది. రాజ‌స్థాన్ రికార్డ్‌ను కోల్‌క‌తాతో జ‌రిగిన మ్యాచ్‌తో పంజాబ్ బ‌ద్ద‌లు కొట్టింది.

టీ20 క్రికెట్‌లో 2023లో వెస్టిండీస్‌పై 259 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించి సౌతాఫ్రికా రికార్డ్ నెల‌కొల్పింది. ఆ రికార్డ్ కూడా పంజాబ్ వ‌ర్సెస్ కోల్‌క‌తా మ్యాచ్‌తో తుడిచిపెట్టుకుపోయింది.

టీ20 క్రికెట్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓ జ‌ట్టు చేసిన అత్య‌ధిక స్కోరు ఇదే. గ‌తంలో 262 ప‌రుగుల‌తో ఆర్‌సీబీ పేరిట ఈ రికార్డ్ ఉంది.

టీ20 క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో అత్య‌ధిక సిక్సులు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి. ఈ మ్యాచ్‌లో ఇరు జ‌ట్లు క‌లిపి 42 సిక్స్‌లు కొట్టాయి. గ‌తంలో ఈ రికార్డ్ ముంబై ఇండియ‌న్స్‌, స‌న్‌రైజ‌ర్స్ పేరిట ఉంది. ఇదే సీజ‌న్‌లో రెండు టీమ్‌లు క‌లిపి 38 సిక్స్‌లు కొట్టాయి. ఆ రికార్డ్ పంజాబ్, కోల్‌క‌తా టీమ్‌లు అధిగ‌మించాయి.

అత్యధికసిక్సులు…

అంతే కాకుండా ఓ టీ20 మ్యాచ్‌లో అత్య‌ధిక సిక్సులు కొట్టిన టీమ్‌గా పంజాబ్ మ‌రో రికార్డ్ నెల‌కొల్పింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ క్రికెట‌ర్లు మొత్తం 24 సిక్స‌ర్లు కొట్టారు. గ‌తంలో ఆర్‌సీబీపై స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌ 22 సిక్స‌ర్లు కొట్ట‌గా…ఆ రికార్డ్‌ను పంజాబ్ దాటేసింది.

ఈ మ్యాచ్‌లో రెండు టీమ్‌లు క‌లిపి 523 ర‌న్స్ చేశాడు. టీ20 క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో రెండు జ‌ట్లు క‌లిపి చేసిన సెకండ్ హ‌య్యెస్ట్ స్కోరు ఇది.ఈ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్‌, ముంబై టీమ్‌ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో రెండు టీమ్‌లు క‌లిపి 549 ర‌న్స్ చేశాయి. ఆ రికార్డ్‌ను 26 ప‌రుగులు దూరంలో పంజాబ్‌, కోల్‌క‌తా నిలిచాయి.

టీ20 క్రికెట్‌లో రెండు టీమ్‌లు క‌లిపి 500ల‌కుపైగా ప‌రుగులు చేయ‌డం ఇది ఏడోసారి. ఈ ఐపీఎల్‌లోనే ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డ్ మూడు సార్లు క్రియేట్ అయ్యింది.

ఫాస్టెస్ట్ సెంచరీ….

పంజాబ్ త‌ర‌ఫున ఐపీఎల్‌లో అత్యంత వేగంగా సెంచ‌రీ చేసిన సెకండ్ క్రికెట‌ర్‌గా బెయిర్ స్టో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 45 బాల్స్‌లో బెయిర్ స్టో సెంచ‌రీ సాధించాడు. గ‌తంలో పంజాబ్ త‌ర‌ఫున డేవిడ్ మిల్ల‌ర్ 38 బాల్స్‌లోనే సెంచ‌రీ కొట్టాడు. ఆర్‌సీబీపై 2013లో ఈ రికార్డ్ సాధించాడు. అంతే కాకుండా ఛేజింగ్‌లో పంజాబ్ త‌ర‌ఫున సెంచ‌రీ చేసిన నాలుగో ప్లేయ‌ర్‌గా బెయిర్ స్టో నిలిచాడు.

ఈ మ్యాచ్‌తో కోల్‌క‌తా త‌ర‌ఫున రెండు వంద‌ల సిక్స‌ర్లు కొట్టిన ఫ‌స్ట్ ప్లేయ‌ర్‌గా ఆండ్రీ ర‌సెల్ నిలిచాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్‌లో ర‌సెల్ 202 సిక్స‌ర్లు కొట్టాడు.

ఐపీఎల్ 2024 తొలి వికెట్ అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఓపెనింగ్ జోడీగా ఫిలిప్ సాల్ట్‌, సునీల్ న‌రైన్ నిలిచారు. వీరిద్ద‌రు క‌లిసి ఫ‌స్ట్ వికెట్‌కు 138 ర‌న్స్ చేశారు.

బెయిర్ స్టో సెంచరీ…

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా 261 ర‌న్స్ చేసింది. ఫిలిప్ సాల్ట్ 37 బాల్స్‌లో 75 ర‌న్స్ చేశాడు. న‌రైన్ 32 బాల్స్‌లో 71 ప‌రుగుల‌తో రాణించారు. ఈ భారీ టార్గెట్‌ను 18.4 ఓవ‌ర్ల‌లోనే పంజాబ్ కింగ్స్ ఛేదించింది. బెయిర్ స్టో ( 48 బాల్స్‌లో తొమ్మిది సిక్స‌ర్లు ఎనిమిది ఫోర్ల‌తో 108 ర‌న్స్ ) సెంచ‌రీతో అద‌ర‌గొట్టాడు. శ‌శాంక్ సింగ్ 28 బాల్స్‌లో ఎనిమిది సిక్స‌ర్లు, రెండు ఫోర్ల‌లో 68 ర‌న్స్, ప్ర‌భ్‌సిమ్రాన్ 20 బాల్స్‌లో ఐదు సిక్స‌ర్లు, నాలుగు ఫోర్ల‌తో 54 ర‌న్స్ చేశారు. వీరి మెరుపుల‌తో పంజాబ్ అల‌వోక‌గా కోల్‌క‌తాపై నెగ్గింది.