AP Weather Updates : ఏపీలో భానుడి భగభగలు ఎక్కువగా ఉన్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగతుండటంతో…జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం దాటితే చాలు…. బయటికి వెళ్లలేకపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో అయితే నిప్పుల వాన కురిసినట్లుగా ఉంటుంది. దీంతో అత్యవసరమైతేనే బయటికి వెళ్లాలని అధికారులు కూడా సూచిస్తున్నారు.

ఇవాళ తీవ్ర వడగాల్పులు…

ఇవాళ ఏపీలోని 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 183 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. రేపు 49 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 88 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ ఎండి రోణంకి కూర్మనాథ్ వెల్లడించింది. ఇవాళ శ్రీకాకుళం 15 , విజయనగరం 22 , పార్వతీపురంమన్యం 13 , అల్లూరిసీతారామరాజు 3, అనకాపల్లి 6, తూర్పుగోదావరి 2, ఏలూరు 2 కాకినాడ ఒక మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని వివరించారు.

మరోవైపు శ్రీకాకుళం11 , విజయనగరం 4, పార్వతీపురంమన్యం 2, అల్లూరిసీతారామరాజు 10, విశాఖపట్నం 3, అనకాపల్లి 12, కాకినాడ 13, కోనసీమ 9, తూర్పుగోదావరి 17, పశ్చిమగోదావరి 3, ఏలూరు 13, కృష్ణా 9, ఎన్టీఆర్ 7, గుంటూరు 9, పల్నాడు 23, బాపట్ల 1, ప్రకాశం 15, తిరుపతి 3, అన్నమయ్య1, అనంతపురం 3, నెల్లూరు 1, సత్యసాయి 9, వైయస్సార్ 5 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

NOTE : వడగాల్పులు వీచే మండలాల పూర్తి వివరాలు క్రింది లింక్ – https://apsdma.ap.gov.in/files/012a5b9665c9d536df3ee16ffe8bd28d.pdf

భానుడి భగభగలు….

శుక్రవారం(ఏప్రిల్ 26) నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.5°C, వైయస్సార్ జిల్లా ఖాజీపేటలో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఇక పల్నాడు జిల్లా మాచేర్లలో 45.2 డిగ్రీలు, కర్నూలు జిల్లా కర్నూలు రూరల్ లో 44.9, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మన్యం జిల్లా సాలూరులో 43.8 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల సంస్థ వెల్లడించింది. 11 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైందనట్లు తెలిపింది.

ఈ మండలాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి – ఏపీ విపత్తుల సంస్థ

• నంద్యాలజిల్లా (05): బనగానపల్లి 10 సార్లు, మహానంది(8), గోస్పాడు7, నందికొట్కూరు 6, చాగలమర్రి 6.

• వైఎస్ఆర్ జిల్లా (04) : మండలాలు ఖాజీపేట 8, చాపాడు 6, సింహాద్రిపురం 6, ప్రొద్దుటూరు6.

• విజయనగరం జిల్లా (03) : రాజాం 5, కొత్తవలస 6, జామి 5

• అనకాపల్లి జిల్లా (02) : రావికమతం 5, దేవరపల్లి 5

• ప్రకాశం జిల్లా (01) : మార్కాపురం 7.

• కర్నూలు (01) : కర్నూలు రూరల్ 6.

• పల్నాడు (01) : నర్సరావుపేట 5.

ఎండల తీవ్రత దృష్ట్యా…. ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఎండదెబ్బ తగలకుండా టోపీ,గొడుగు,టవల్,కాటన్ దుస్తులు ఉపయోగించాలని చెబుతున్నారు. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలని… గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని హెచ్చరిస్తున్నారు.