Pbks Playoff Scenario: శుక్ర‌వారం కోల్‌క‌తాతో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ రికార్డ్ విజ‌యాన్ని అందుకున్న‌ది. కోల్‌క‌తా విధించిన 261 ప‌రుగుల టార్గెట్‌ను మ‌రో ఎనిమిది బాల్స్ మిగిలుండ‌గానే పంజాబ్ ఛేదించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ ప్లేయ‌ర్లు సిక్స‌ర్ల వ‌ర్షం కురిపించారు. పంజాబ్ ఇన్నింగ్స్‌లో మొత్తం 24 సిక్స్‌లు న‌మోదు అయ్యాయి.

రికార్డ్ ఛేజ్‌…

ఐపీఎల్‌తో పాటు టీ20 హిస్ట‌రీలో ఓ ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక సిక్స్‌లు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి. టీ20 చ‌రిత్ర‌లో అత్య‌ధిక ప‌రుగుల్ని ఛేజ్ చేసిన జ‌ట్టుగా పంజాబ్ రికార్డు నెల‌కొల్పింది.

ఎనిమిదో ప్లేస్‌కు…

కోల్‌క‌తాపై విజ‌యంతో ఐపీఎల్ పాయింట్స్ టేబుల్‌లో తొమ్మిది నుంచి ఓ స్థానం పైకి ఎగ‌బాకి ఎనిమిదో ప్లేస్‌కు చేరుకుంది పంజాబ్‌. ఎనిమిదో స్థానంలో ఉన్న ముంబై తొమ్మిదికి ప‌డిపోయింది. ఈ సీజ‌న్‌లో పంజాబ్‌కు ఇది మూడో విజ‌యం మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం.

ఆరు పాయింట్లు…

కోల్‌క‌తాపై రికార్డ్ విక్ట‌రీతో పంజాబ్ త‌న ప్లేఆఫ్స్ ఆశ‌ల‌ను స‌జీవం చేసుకున్న‌ది. ప్లేఆఫ్స్ చేరాలంటే ప్ర‌తి టీమ్‌కు ప‌ద‌హారు పాయింట్లు అవ‌స‌రం. వీటితో పాటు నెట్ ర‌న్‌రేట్ స‌హా మ‌రికొన్ని అంశాల‌పై ప్లేఆఫ్స్ బెర్తుఆ ధార‌ప‌డి ఉంటుంది. కాగా ప్ర‌స్తుతం ఐపీఎల్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరు పాయింట్ల‌తో పంజాబ్ ఎనిమిదో ప్లేస్‌లో ఉంది.

లీగ్ ద‌శ‌లో పంజాబ్ ఇంకో ఐదు మ్యాచ్‌లు ఆడాల్సి వుంది. ఈ ఐదు మ్యాచుల్లో విజ‌యం సాధిస్తే ప‌ద‌హారు పాయింట్ల‌కు పంజాబ్‌ చేరుకుంటుంది. ఇక‌పై ఆడే ప్ర‌తి మ్యాచ్‌లో పంజాబ్‌కు గెలుపు త‌ప్ప‌నిస‌రిగా మారింది. అది కూడా సాదాసీదాగా కాకుండా రికార్డ్ విజ‌యాలు సాధిస్తేనే పంజాబ్ ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవ‌కాశం ఉంటుంది.

ర‌న్‌రేట్ మెరుగ‌వ్వాలి…

ప్లేఆఫ్స్ రేసులో నిల‌బ‌డాలంటే నెట్‌ర‌న్‌రేట్‌ను పంజాబ్ మెరుగుప‌ర‌చుకోవాలి. ప్ర‌స్తుతం పంజాబ్ నెట్‌ర‌న్‌రేట్ -0.187గా ఉంది. ఈ ర‌న్‌రేట్ మైన‌స్ నుంచి ప్ల‌స్‌లోకి రావాలి. మ‌రోవైపు సీఎస్‌కే, గుజ‌రాత్ టైటాన్స్‌, ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌యాప‌జ‌యాల‌పై కూడా పంజాబ్ ప్లేఆఫ్స్ అవ‌కాశాలు ఆధార‌ప‌డి ఉన్నాయి.

శ‌నివారం ఢిల్లీ, ముంబై మ‌ధ్య మ్యాచ్ జ‌రుగ‌నుంది. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడిపోవ‌డం పంజాబ్‌కు ప్ల‌స్స‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తోన్నాయి.

2016లో రన్న‌ర‌ప్‌…

ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన 16 సీజ‌న్స్‌లో పంజాబ్ రెండు సార్లు మాత్ర‌మే ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. 2016లో పంజాబ్‌జ‌ట్టు ర‌న్న‌ర‌ప్‌గా నిలిచింది. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ టీమ్‌కు ఇదే అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న కావ‌డం గ‌మ‌నార్హం. ఐపీఎల్ ఫ‌స్ట్ సీజ‌న్‌లో సెమీస్ చేరుకున్న‌ది. ఆ త‌ర్వాత ఎప్పుడు లీగ్ ద‌శ కూడా దాట‌లేదు.

చివ‌రి ఓవ‌ర్‌లో…

ఈ సారి పంజాబ్ బ్యాటింగ్ బౌలింగ్‌లోనూ అద‌ర‌గొడుతోన్న అదృష్టం మాత్రం క‌లిసిరావ‌డం లేదు. ఈ సీజ‌న్‌లో జ‌రిగిన ప్ర‌తి మ్యాచ్‌లో విజ‌యం ముగింట చివ‌రి ఓవ‌ర్‌లో బోల్తాకొట్టింది.