Heavy rush of pilgrims in Sabarimala | శబరిమల ఆలయానికి పోటెత్తిన భక్తులు

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఇడుముడి సమర్పించేందుకు సమయం దగ్గర పడుతుండడంతో మరింత మంది భక్తులు వస్తున్నారు. దీంతో శబరిమల ప్రాంతం కిక్కిరిపోయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ నుంచి భక్తుల రాక భారీగా…

Dance for Lord Krishna: శ్రీ కృష్ణుడు జ్ఞాపకార్ధం 37 వేల మంది మహిళల నాట్యం

ద్వారక అద్భుత ఘట్టానికి వేదికైంది. వేలాది మంది మహిళలు ఒకేచోట సంప్రదాయ నృత్యం చేసి ఔరా అనిపించారు. వేయి రెండువేలు కాదు ఏకంగా 37 వేల మంది మహిళలు, యువతులు శ్రీకృష్ణుడిని తలచుకుంటూ నృత్యాలు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడి…

TSRTC Request : ఆ బస్సులను ఎక్కువగా వాడుకోండి – మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ ఎండీ రిక్వెస్ట్

TSRTC On MahaLakshmi Scheme: మహిళా ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎండీ సజ్జనార్ వీడియోను విడుదల చేశారు. “ఎక్స్‌ ప్రెస్‌ బస్సుల్లో తక్కువ దూరం ప్రయాణించే మహిళలు ఎక్కువగా వెళ్తున్నట్లు TSRTC యాజమాన్యం దృష్టికి వచ్చింది. దీనివల్ల…

Road Accident | ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. కారులో చెలరేగిన మంటలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. పెనుగంచిప్రోలు మండ‌లం ముళ్లపాడు క్రాస్ రోడ్డు వద్ద హైవేపై దూసుకెళ్తున్న కారు.. ఒక్కసారిగా డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో భారీగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మృతి చెందగా..మరో…

AP News | టీడీపీ సభకు పవన్ వెళ్లారు.. జగన్ పుట్టిన రోజుకు నేను వచ్చా: జనసేన నేత

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై ఆ పార్టీ నాయకుడు శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన పెద్ద మనిషి ఫంక్షన్ యువగళం సభకు పవన్ వెళ్లారని విమర్శించారు. పవన్ ఆ సభకు వెళ్లినందుకే.. తాను సీఎం…

Telangana Free Bus | మగాళ్ల కోసం బస్సులో ప్రత్యేకంగా సీట్లు పెట్టించండి రేవంత్ గారు..

తెలంగాణలో మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పించినప్పటి నుంచి పురుషులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని బస్సుల్లో కనీసం నిల్చునేందుకు కూడా స్థలం ఉండటం లేదు. మరికొన్ని బస్సుల్లో అనేక ఇబ్బందులు పడుతూ ప్రయాణిస్తున్నారు. వందల కిలోమీటర్లు బస్సులో నిలబడి ఎలా…

Hanamkonda Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. ఎల్కతుర్తి మండలం శాంతి నగర్ వద్ద రోడ్డు ఈ ప్రమాదం జరిగింది.…

Panjagutta | భారీ అగ్ని ప్రమాదం.. ప్రాణాలకు తెగించి ఫ్యామిలీని కాపాడిన పోలీస్

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట ఎర్రమంజిల్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పంజాగుట్టలోని ఓ బిల్డింగ్ నాలుగో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో ఉన్న నివాసితులు వెంటనే బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న…

Salaar Movie Released | థియేటర్లలో ఫ్యాన్స్ హడావిడి.. వీడియోస్ వైరల్

ప్రభాస్ హీరోగా నటించిన మోస్ట్ క్రేజియస్ట్ మూవీ ‘సలార్’ ప్రీమియర్ షో ఫ్యాన్సు చూసేశారు. హైదరాబాద్, బెంగళూరు సహా ప్రధాన నగరాల్లో థియేటర్ల వద్ద పడిగాపులు కాసి మరీ టికెట్లు కొనుగోలు చేశారు. ప్రశాంత్ నీల్-ప్రభాస్, పృథ్వీరాజ్-సుకుమారన్ మధ్య బలమైన స్నేహ…

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు