EPFO details in Telugu: తెలుగులో ఈపీఎఫ్ అకౌంట్ వివరాలను తెలుసుకోవాలా?.. ఇలా చేయండి..

ఈపీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ ను చెక్ చేయాలనుకుంటే అందుకు వివిధ మార్గాలున్నాయి. ఉమాంగ్ యాప్ ద్వారా లేక ఆన్ లైన్ లో ఈపీఎఫ్ పోర్టల్ ద్వారా లేదా మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా లేదా ఎస్ఎంఎస్ పంపడం ద్వారా ఈపీఎఫ్ అకౌంట్…

JioCinema ad-free premium plan: అత్యంత చవకగా జియో సినిమా ప్రీమియం ప్లాన్; రోజుకు రూ. 1 లోపే..

హాలీవుడ్ సినిమాలు, టీవీ షోలతో సహా ప్రీమియం కంటెంట్ ను ప్రకటనలు లేకుండా అందించే ప్రీమియం ప్లాన్ ధరలను జియో సినిమా తగ్గించింది. సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లు ఇప్పుడు నెలకు రూ.29 నుంచి ప్రారంభమవుతాయని బ్రాడ్ కాస్టర్ వయాకామ్ 18…

EPFO interest: ఈపీఎఫ్ వడ్డీ ఎప్పుడు జమ అవుతుంది?.. చందాదారుల ప్రశ్నకు సమాధానమిచ్చిన ఈపీఎఫ్ఓ

EPFO interest: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన సోషల్ మీడియా ఫాలోవర్ల కోసం ‘ఎక్స్’ ప్లాట్ ఫామ్ లో క్విజ్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్నవారికి ప్రశంసా పత్రాలను అందజేసింది. అయితే, చాలామంది చందాదారులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ…

Kotak Mahindra Bank: ఆర్బీఐ ఆంక్షలతో కుప్పకూలిన కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు ధర

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కఠిన చర్యలతో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు ధర గురువారం ప్రారంభ ట్రేడింగ్ లోనే 10 శాతం క్షీణించింది. బీఎస్ఈలో కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు ధర 10 శాతం క్షీణించి రూ.1,658.75 వద్ద…

Day trading: ఈ రోజు డే ట్రేడింగ్ కోసం నిపుణులు సూచిస్తున్న స్టాక్స్ ఇవే..

నిఫ్టీ 50 ఇండెక్స్ నిఫ్టీ 50 ఇండెక్స్ 22,200 నుంచి 22,250 మార్కును అధిగమించే వరకు భారత స్టాక్ మార్కెట్ సానుకూలంగా ఉంటుందని ఆనంద్ రాఠీ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ మేనేజర్ గణేశ్ డోంగ్రే అభిప్రాయపడ్డారు. 50 షేర్ల ఇండెక్స్ నిఫ్టీ…

Kotak Bank: కోటక్ బ్యాంక్ కు ఆర్బీఐ షాక్; కొత్తగా క్రెడిట్ కార్డ్స్ జారీ చేయొద్దని, కొత్త ఖాతాలు ఓపెన్ చేయవద్దని ఆదేశాలు

ఆర్బీఐ ప్రకటన కొటక్ మహీంద్రా బ్యాంక్ పై విధించిన ఆంక్షలను వివరిస్తూ ఆర్బీఐ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ‘‘బ్యాంక్ తన క్రెడిట్ కార్డు కస్టమర్లతో సహా ప్రస్తుత కస్టమర్లకు సేవలను అందిస్తూనే ఉంటుంది’’ అని పేర్కొంది. కొటక్…

Realme Narzo smart phones launch: భారత్ లో రియల్ మీ నార్జో 70 5జీ, నార్జో 70ఎక్స్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్!

నార్జో 70 5జీ సిరీస్ లో రెండు స్మార్ట్ ఫోన్స్ ను రియల్ మీ (Realme) భారత్ లో లాంచ్ చేసింది. అవి రియల్ మీ నార్జో 70 5జీ, నార్జో 70ఎక్స్. వీటిలో ఫోన్ ను చల్లగా ఉంచడానికి థర్మల్…

PM KISAN: రైతుల ఖాాతాల్లో పీఎం కిసాన్ 17వ విడత డబ్బులు పడే తేదీ ఇదే..

పీఎం కిసాన్ పథకం 16వ విడతను 2024 ఫిబ్రవరి 28న అర్హులైన రైతులందరికీ ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) విడుదల చేశారు. మొత్తం వాయిదా మొత్తం రూ.21,000 కోట్లకు పైగా విలువ చేసే ఈ మొత్తాన్ని 9 కోట్ల మంది…

Gold rate: రెండు వారాల కనిష్టానికి బంగారం ధరలు; సడెన్ గా తగ్గడానికి కారణాలు ఏంటి?

Gold and silver prices today : దేశంలో బంగారం ధరలు బుధవారం కూడా తగ్గాయి. 10గ్రాముల పసిడి (22క్యారెట్లు) ధర రూ. 1060 దిగొచ్చి.. రూ. 66,600 కి చేరుకుంది. మంగళవారం ఈ ధర రూ. 67,540 గా ఉంది.…

BHA shoe size system: త్వరలో భారత్ కే ప్రత్యేకమైన ‘షూ సైజింగ్ సిస్టమ్’; ‘భా’ అనే పేరుతో అమలు

BHA shoe size system:త్వరలో భారతీయుల కోసం ప్రత్యేకమైన పాదరక్షల సైజింగ్ విధానం అందుబాటులోకి రానుంది. భారత్ లోని వివిధ వయస్సుల వ్యక్తులకు మరింత సౌకర్యవంతమైన పాదరక్షలను రూపొందించడానికి వ్యక్తుల పాదం పొడవును మాత్రమే కాకుండా వెడల్పును కూడా పరిగణనలోకి తీసుకుని…

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు