SRH vs RCB : ‘ప్రతి మ్యాచ్​ గెలవలేము’- హైదరాబాద్​ జట్టుకు ప్యాట్​ కమిన్స్​ మోటివేషన్​..

SRH vs RCB highlights : ఈ ఐపీఎల్​ 2024లో సన్​రైజర్స్ హైదరాబాద్ విజయానికి దోహదపడిన కీలక అంశాల్లో ఒకటి.. మొదట బ్యాటింగ్ చేసి రికార్డు స్థాయి స్కోర్లు నమోదు చేయడం. ఈ సీజన్​లో రెండుసార్లు.. ఐపీఎల్​ హిస్టరీలోనే అత్యధిక స్కోరు…

SRH vs RCB: ఛేజింగ్‍లో చతికిలపడిన హైదరాబాద్.. ఆరు పరాజయాల తర్వాత బెంగళూరుకు గెలుపు.. ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ

IPL 2024 SRH vs RCB: ఐపీఎల్ 2024 సీజన్‍లో రికార్డుల మోతతో జోష్ మీద ఉన్న సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఎదురుదెబ్బ తగిలింది. హోం గ్రౌండ్ ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్‍ నేడు (ఏప్రిల్ 25) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చేతిలో ఓటమి…

SRH vs RCB: ఉప్పల్‍లో టాస్ గెలిచిన బెంగళూరు.. ఈసారి ఆ పొరపాటు చేయలేదు!

IPL 2024: ఐపీఎల్‍ 2024 సీజన్‍లో సన్‍రైజర్స్ హైదరాబాద్ (SRH) విధ్వంసకర దూకుడుతో అదరగొడుతోంది. ఈ సీజన్‍లోనే రెండుసార్లు ఐపీఎల్‍లో అత్యధిక స్కోరు చేసి చరిత్ర సృష్టించింది. పది రోజుల కిందటే చిన్నస్వామి వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)ను బాదేసి..…

Ind vs Pak in T20 WC Promo: అల్టిమేట్ ఫైట్.. టీ20 వరల్డ్ కప్ 2024లో ఇండియా, పాకిస్థాన్ ప్రోమో రిలీజ్

Ind vs Pak in T20 WC Promo: క్రికెట్‌లో ఈ ఏడాది మరో వరల్డ్ కప్ అభిమానులను అలరించనుంది. ఐపీఎల్ ముగియగానే టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే కదా. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ స్పోర్ట్స్…

IPL Impact Player: ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌తో ఆల్ రౌండర్ల పని ఖతం.. అలాంటిదేమీ లేదు: అక్షర్ vs డివిలియర్స్

IPL Impact Player: ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఆల్ రౌండర్లను లేకుండా చేస్తోందంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదలు పెట్టిన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆల్ రౌండర్ పాత్ర ప్రమాదంలో పడిందని రోహిత్ కామెంట్స్ ను సమర్థించేలా…

Wasim Akram on Mumbai Indians: ఇండియాలో ఇదే ప్రాబ్లెం: రోహిత్‌ను తప్పించడంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

Wasim Akram on Mumbai Indians: ఐపీఎల్ 2024 సీజన్ సగానికిపైనే ముగిసినా.. ఇప్పటికీ ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పుపై చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ కూడా దీనిపై స్పందించాడు. ఇండియా, పాకిస్థాన్ లలో…

DC vs GT: థ్రిల్లింగ్ పోరులో ఢిల్లీ ధమాకా.. పోరాడి ఓడిన గుజరాత్

DC vs GT: ఐపీఎల్ 2024 సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ మళ్లీ పుంజుకుంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో గెలిచి ప్లేఆఫ్స్ ఆశలను మరింత పెంచుకుంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ 4…

Delhi Capitals: ఢిల్లీ గడ్డపై పంత్ షో.. దుమ్మురేపిన రిషబ్.. కళ్లు చెదిరేలా హెలికాప్టర్ షాట్ కూడా: వీడియో

Delhi Capitals vs Gujarat Titans: ఢిల్లీ క్యాపిటల్స్ (DC) కెప్టెన్ రిషభ్ పంత్ ధనాధన్ హిట్టింగ్‍తో దుమ్మురేపాడు. హోం గ్రౌండ్ ఢిల్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‍లో తన మార్క్ షాట్లతో హెరెత్తించాడు. గుజరాత్ టైటాన్స్ (GT) బౌలర్లను దడదడలాడించాడు. జీటీ…

IPL Richest Indian Players: ఐపీఎల్లో రిచెస్ట్ ఇండియన్ ప్లేయర్స్ వీళ్లే.. రోహిత్, కోహ్లి ఎంత సంపాదిస్తున్నారో చూడండి

IPL Richest Indian Players: ఐపీఎల్లో మొదటి ఏడాది అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రూ.6 కోట్లతో ధోనీ రికార్డు క్రియేట్ చేశాడు. కానీ తర్వాత ఈ మొత్తం భారీగా పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్లో అత్యధిక మొత్తం అందుకుంటున్న ఇండియన్…

Virender Sehwag: టీ20 ప్రపంచకప్‍లో భారత తుదిజట్టులో ఎవరు ఉండాలో చెప్పిన సెహ్వాగ్.. పాండ్యా లేకుండానే..

Virender Sehwag: ఈ ఏడాది జూన్‍లో జరిగే టీ20 ప్రపంచకప్ టోర్నీకి ఎంపికయ్యే భారత జట్టు ఎంపికపై ఉత్కంఠ నెలకొని ఉంది. ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్‍ జరుగుతున్న తరుణంలో ఈ విషయంపై చర్చలు విపరీతంగా సాగుతున్నాయి. ప్రపంచకప్‍ కోసం టీమిండియాకు…

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు