SRH vs RCB highlights : ఈ ఐపీఎల్​ 2024లో సన్​రైజర్స్ హైదరాబాద్ విజయానికి దోహదపడిన కీలక అంశాల్లో ఒకటి.. మొదట బ్యాటింగ్ చేసి రికార్డు స్థాయి స్కోర్లు నమోదు చేయడం. ఈ సీజన్​లో రెండుసార్లు.. ఐపీఎల్​ హిస్టరీలోనే అత్యధిక స్కోరు చేసింది సన్​రైజర్స్​ హైదరాబాద్​. కానీ ఈసారి ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్​ టాస్​ గెలిచి బ్యాటింగ్​ తీసుకున్నాడు.

‘మేం మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నాము. అది మాకు బాగా పనిచేస్తోంది. గత కొన్ని విజయాలకు ముందు మాది బౌలింగ్ ఫస్ట్ జట్టు అని అనుకున్నాం. కానీ అలా జరగలేదు,’ అని కమిన్స్ పేర్కొన్నాడు.

ఈ మ్యాచ్ అనంతరం ఏప్రిల్ 28న చెన్నై సూపర్ కింగ్స్​తో సన్​రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.

ఆర్సీబీ వర్సెస్​ సన్​రైజర్స్​ హైదరాబాద్​..

IPL 2024 latest news : ఈ మ్యాచ్​లో ఆర్సీబీ ఆటగాడు రజత్ పాటిదార్ 20 బంతుల్లో 5 సిక్సర్లతో 50 పరుగులు చేయగా, కోహ్లీ 43 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఆర్సీబీ సన్​రైజర్స్ హైదరాబాద్​కు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే టోర్నీలో అత్యంత బలహీనమైన బౌలింగ్ అటాక్​గా బరిలోకి ఆర్సీబీపై హైదరాబాద్​ గెలవలేకపోయింది. హైదరాబాద్ 8 వికెట్ల నష్టానికి 171 (20 ఓవర్లు) పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ కేవలం ఒక్క పరుగుకే ఔట్​ అవ్వగా.. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 31 పరుగులు చేసి శుభారంభం అందించాడు. సన్​రైజర్స్​ హైదరాబాద్​ టాప్ ఆర్డర్ ఐడెన్ మార్క్రమ్ 7 పరుగుల వద్ద ఔటవ్వగా, హార్డ్ హిట్టింగ్ హెన్రిచ్ క్లాసెన్ కూడా అదే స్కోరుకు పడిపోయాడు. పార్ట్ టైమ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ స్వప్నిల్ సింగ్ మూడు ఓవర్లలో 2/40తో రాణించాడు.

ఈ మ్యాచ్​లో ఓటమితో హైదరాబాద్ 10 పాయింట్లతో కోల్​కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్​తో సమానంగా నిలిచింది. ఐపీఎల్​ 2024 పాయింట్స్​ టేబుల్​లో మూడో స్థానంలో ఉంది. ఇక బెంగళూరు నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది.