AP Electricity: ఏపీలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం, 245 మిలియన్ యూనిట్లు దాటిన విద్యుత్ డిమాండ్…

AP Electricity: ఏపీలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్రంలో వేసవి ఎండల Summer Temparatures తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని విద్యుత్ పంపిణీ సంస్థల్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికారులను…

Rs20 Travel Meals: ఆ రైల్వే స్టేషన్లలో రూ.20కే భోజనం.. అందుబాటులో ఎకానమీ మీల్స్‌

Rs20 Travel Meals: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైల్వే స్టేషన్లలో రూ.20కే భోజనం కొనుగోలు చేసే సదుపాయాన్ని ఐఆర్‌సిటిసి IRCTC ప్రారంభించింది. రైలు ప్రయాణాల్లో భోజనం చేయాలంటే జేబులు ఖాళీ కావడంతో పాటు నాణ్యత లేని నాసిరకం భోజనాలతో…

AP Weather Updates: నేడు ఏపీలో 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు… 143 మండలాల్లో వడగాల్పుల వార్నింగ్…

AP Weather Updates: రాష్ట్ర వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు ‌High Temparatures కొనసాగుతున్నాయి. మంగళవారం నంద్యాల జిల్లా చాగలమర్రిలో 45.1°C, విజయనగరం జిల్లా జామిలో 44.9°C, వైయస్సార్ జిల్లా ఖాజీపేటలో 44.6°C, కర్నూలు జిల్లా వగరూరులో 44.2°C, అనకాపల్లి జిల్లా దేవరపల్లెలో…

Telugu Student Died in Kyrgyzstan : కిర్గిస్థాన్ లో గడ్డకట్టిన జలపాతంలో చిక్కుకుని, తెలుగు వైద్య విద్యార్థి మృతి

Telugu Student Died in Kyrgyzstan : కిర్గిస్థాన్‌లో( Kyrgyzstan) గడ్డకట్టిన జలపాతం(Frozen Waterfall)లో చిక్కుకుని తెలుగు వైద్య విద్యార్థి మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి(Anakapalle) జిల్లాకు చెందిన దాసరి భీమరాజు రెండో కుమారుడు దాసరి చందు(20) కిర్గిస్థాన్ లో ఎంబీబీఎస్…

Kadiyam Bride Kidnap : కళ్లలో కారం కొట్టి, పెళ్లి కూతురి కిడ్నాప్ నకు యత్నం-ప్రేమ పెళ్లే అసలు కారణం!

Kadiyam Bride Kidnap : తూర్పుగోదావరి జిల్లా(East Godavari)లో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లిపీటల మీద నుంచి పెళ్లికూతురిని కిడ్నాప్ (Bride Kidnap)చేసేందుకు ప్రయత్నించారు. కళ్లలో కారం కొట్టి పెళ్లికూతురిని బలవంతంగా లాక్కెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.…

Thota Trimurthulu : తోట త్రిమూర్తులుకు హైకోర్టులో ఎదురుదెబ్బ, జైలు శిక్షపై స్టేకు నిరాకరణ

Thota Trimurthulu : శిరోముండనం కేసులో మండపేట వైసీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు(Thota Trimurthulu) హైకోర్టు (AP High Court)షాక్ ఇచ్చింది. విశాఖ ఎస్సీ,ఎస్టీ కోర్టు విధించిన శిక్షపై స్టే విధించేందుకు నిరాకరించింది. 28 ఏళ్ల క్రితం దళిత యువకులకు శిరోముండనం(Dalit…

Trains Cancelled: ప్రయాణికులకు రైల్వే వేసవి కానుక…విజయవాడ డివిజన్‌లో పలు ప్యాసింజర్ రైళ్ల రద్దు..

Trains Cancelled: రైల్వే నిర్వహణ పనుల్లో భాగంగా విజయవాడ Vijayawada రైల్వే డివిజన్‌ పరిధిలో పలు రైళ్లను పూర్తిగాను, మరికొన్ని రైళ్లను పాక్షికంగాను రద్దు చేశారు. ప్యాసింజర్ రైళ్ల రద్దుతో ప్రయాణికులు ప్రత్యామ్నయ మార్గాలను చూసుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 22 నుంచి…

AP ADCET 2024: ఏపీలో ఫైన్‌ ఆర్ట్స్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల.. దరఖాస్తు చేసుకోండి ఇలా..

AP ADCET 2024: ఆంధ్రప్రదేశ్‌ ఆర్ట్ అండ్ డిజైన్‌ కామన్ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ను ఏపీ ఉన్నత విద్యా మండలిAPSCHE విడుదల చేసింది. కడపలోని డాక్టర్ వైఎస్సార్‌ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ DR.YSRAFAU 2024-25 విద్యా…

Ontimitta Kalyanam: పున్నమి వెన్నెల్లో కన్నుల పండుగలా ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణోత్సవం..

Ontimitta Kalyanam: ఒంటిమిట్టలో సీతారాముల  Seetharama కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతారాముల‌ క‌ల్యాణాన్ని తిలకించేందుకు భక్తలు వేల సంఖ్యలో హాజరయ్యారు. స్వామి వారి కళ్యాణోత్సవాలకు kalyanam హాజరైన వారికి TTD టీటీడీ తరపున తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు,…

AP TS Weather Updates: ఠారెత్తిస్తున్న ఎండలు… నిప్పుల కుంపట్ల తెలుగు రాష్ట్రాలు

AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్ని భానుడు Summer ఠారెత్తిస్తున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో Temparature జనం విలవిల్లాడుతున్నారు. సోమవారం నంద్యాల జిల్లా గోస్పాడులో 45.3°డిగ్రీలు, వైయస్సార్ జిల్లా వెదురూరులో45.2°డిగ్రీలు, అనకాపల్లి జిల్లా రావికమతంలో 44.8°డిగ్రీలు, విజయనగరం జిల్లా జామిలో…

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు