AP TS Weather Updates: తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్ని భానుడు Summer ఠారెత్తిస్తున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో Temparature జనం విలవిల్లాడుతున్నారు. సోమవారం నంద్యాల జిల్లా గోస్పాడులో 45.3°డిగ్రీలు, వైయస్సార్ జిల్లా వెదురూరులో45.2°డిగ్రీలు, అనకాపల్లి జిల్లా రావికమతంలో 44.8°డిగ్రీలు, విజయనగరం జిల్లా జామిలో 44.6°డిగ్రీలు, ప్రకాశం జిల్లా దరిమడుగులో 44.2°డిగ్రీలు, కర్నూలు జిల్లా కోడుమూరు, తిరుపతి జిల్లా పెద్దకన్నలిలో 44.2°డిగ్రీలు, చిత్తూరు జిల్లా నింద్రలో 44°డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 65 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 98 మండలాల్లో  Heat Waves వడగాల్పులు వీచాయి.

బుధవారం ఆంధ్రప్రదేశ్‌లోని 43 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ఎల్లుండి 20 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 100 వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు విపత్తుల సంస్థ SDMA ఎండి రోణంకి కూర్మనాథ్ తెలిపారు. 

బుధవారం తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు

శ్రీకాకుళం జిల్లాలో 9, విజయనగరంలో 22, పార్వతీపురంమన్యంలో 11, అనకాపల్లి జిల్లాలోని కె.కోటపాడు మండలంలో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది.

బుధవారం శ్రీకాకుళంలో 11, విజయనగరంలో 4, పార్వతీపురంమన్యంలో 4, అల్లూరిసీతారామరాజులో 10, విశాఖపట్నంలో 4, అనకాపల్లి 15, కాకినాడ 16, కోనసీమ 7, తూర్పుగోదావరి 17, ఏలూరు 9, ఎన్టీఆర్ 3, గుంటూరు 1, పల్నాడు 2, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని హెచ్చరించారు.

ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి త్రాగాలని విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ సూచించారు.

తెలంగాణలో తేలికపాటి వర్షాలు…

తెలంగాణలో రెండ్రోజులపాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ IMD తెలిపింది. సోమవారం తెలంగాణలోని నల్లగొండ జిల్లా టిక్యా తండాలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జిల్లాలోని బుగ్గబావి గూడ, మాడుగులపల్లి, సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో 44.9డిగ్రీలు, నల్లగొండ జిల్లా మాటూర్‌లో 44.7డిగ్రీలు, మహబూబాబాద్‌ జిల్లా కొమ్ములవంచలో 44.6డిగ్రీలు, నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో 44.4డిగ్రీలు, తిమ్మాపూర్‌, ఇబ్రహీంపేటలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

రాష్ట్రంలోని నాలుగైదు జిల్లాలు మినహా మిగిలిన అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ మంగళ, బుధవారాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. తెలంగాణలో రెండ్రోజులు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో అసాధారణ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 4 నుంచి 6 డిగ్రీల వరకు అదనంగా నమోదవుతున్నాయి.

దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, రాయలసీమ మీదుగా కోస్తా తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండి పేర్కొంది. సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.