Trains Cancelled: రైల్వే నిర్వహణ పనుల్లో భాగంగా విజయవాడ Vijayawada రైల్వే డివిజన్‌ పరిధిలో పలు రైళ్లను పూర్తిగాను, మరికొన్ని రైళ్లను పాక్షికంగాను రద్దు చేశారు. ప్యాసింజర్ రైళ్ల రద్దుతో ప్రయాణికులు ప్రత్యామ్నయ మార్గాలను చూసుకోవాల్సి ఉంటుంది.

ఏప్రిల్ 22 నుంచి మే 22 మధ్య కాలంలో దాదాపు 14రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. రద్దైన రైళ్లలో ట్రైన్‌ నంబర్ 07977 బిట్రగుంట విజయవాడ ప్యాసింజర్, ట్రైన్ నంబర్ 07978 విజయవాడ-బిట్రగుంట ప్యాసింజర్ రైలును ఏప్రిల్ 22 నుంచి 28వరకు రద్దు చేశారు.

ట్రైన్‌ నంబర్ 17237 బిట్రగుంట-చైన్నై సెంట్రల్, ట్రైన్‌ నంబర్ 17238 చెన్నై సెంట్రల్-బిట్రగుంట రైలును ఏప్రిల్ 22- 26 తేదీల మధ్య రద్దు చేశారు.

ట్రైన్‌ నంబర్ 07279 విజయవాడ-తెనాలి, ట్రైన్‌ నంబర్‌ 07575 తెనాలి-విజయవాడ రైలును ఏప్రిల్‌ 22-28 మధ్య రద్దు చేశారు.

ట్రైన్ నంబర్‌ 07884 రాజమండ్రి-భీమవరం జంక్షన్, 07883 నర్సాపుర్-రాజమండ్రి రైలు, ట్రైన్‌ నంబర్‌ 17243 గుంటూరు- రాయగడ-గుంటూరు ప్యాసింజర్‌ ఏప్రిల్ 29 నుంచి మే 27వరకు రద్దు చేశారు.

ట్రైన్ నంబర్ 17267 కాకినాడ పోర్ట్‌-విశాఖపట్నం రైలును ఏప్రిల్ 29 నుంచి మే 26వరకు, ట్రైన్ నంబ్ 17268 విశాఖపట్నం-కాకినాడ రైలును ఏప్రిల్ 29 నుంచి మే 26వరకు రద్దు చేశారు. ట్రైన్‌ నంబర్ 12713 విజయవాడ-సికింద్రాబాద్ ఏప్రిల్ 29 నుంచి మే 10వరకు, మే 16 నుంచి మే 22వరకు రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 12714 సికింద్రాబాద్-విజయవాడ రైలును ఏప్రిల్ 29 నుంచి మే 10వ తేదీ వరకు మే 16 నుంచి మే 22వరకు రద్దు చేశారు.

ఆ రైళ్లు విజయవాడలోకి రావు…

ట్రైన్‌ నంబర్ 07896 మచిలీపట్నం -విజయవాడ, ట్రైన్‌ నంబర్ 07769 విజయవాడ – మచిలీపట్నం, ట్రైన్ నంబర్ 07863 నర్సాపూర్‌ విజయవాడ, ట్రైన్ నంబర్ 07866 విజయవాడ మచిలీపట్నం, ట్రైన్ నంబర్‌ 07770 మచిలీపట్నం – విజయవాడ, ట్రైన్ నంబర్ 07283 విజయవాడ -భీమవరం, ట్రైన్ నంబర్ 07870 మచిలీపట్నం-విజయవాడ, ట్రైన్ నంబర్ 07861 విజయవాడ-నర్సాపూర్‌ రైలును విజయవాడ- నర్సాపూర్ రైళ్లు ఏప్రిల్ 29 నుంుచి మే 26వ తేదీ వరకు విజయవాడ రామవరప్పాడు Ramavarappadu రైల్వే స్టేషన్ వరకు మాత్రమే నడుపుతారు. ఈ ప్యాసింజర్ రైళ్లను విజయవాడ స్టేషన్‌కు అనుమతించరు.

రైళ్ల దారి మళ్లింపు…

విజయవాడ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను ఏప్రిల్, మే నెలల్లో దారి Diversions మళ్లిస్తారు. వీక్లీ రైళ్లను విజయవాడ-గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా వాటి గమ్యస్థానాలకు రాకపోకలు సాగిస్తాయి. ఈ క్రమంలో ఏలూరు, తాడేపల్లి గూడెం వంటి స్టేషన్లలో రైళ్లను ఆపరని ప్రకటించారు.

ట్రైన్‌ నంబర్‌ 22643 ఎర్నాకుళం-పాట్నా ఎక్స్‌ప్రెస్‌, ట్రైన్ నంబర్ 12756 భావ్‌నగర్‌-కాకినాడ పోర్ట్, ట్రైన్ నంబర్ 12509 బెంగుళూరు-గౌహతి, ట్రైన్‌ నంబర్ 11019 చత్రపతి శివాజీ టెర్మినల్-భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్, ట్రైన్ నంబర్ 13351 ధన్‌బాద్‌-అలప్పుజా, ట్రైన్ నంబర్ 18111 టాటా-యశ్వంతపూర్‌, ట్రైన్ నంబర్ 12376 జసిద్ది-తాంబరం, ట్రైన్ నంబర్ 22837 హతియా-ఎర్నాకుళం, ట్రైన్ నంబర్ 18637 హతియా-బెంగుళూరు, ట్రైన్‌ నంబర్ 12835 హతియా-బెంగుళూరు, ట్రైన్ నంబర్‌ 12889 టాటా-బెంగుళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లను విజయవాడ నిడదవోలు, భీమవరం, గుడివాడ మార్గంలో నడుపుతారు.