Auto-brewery syndrome: ‘అతడి బాడీ ఒక ఆల్కహాల్ ఫ్యాక్టరీ; సొంతంగా లిక్కర్ తయారు చేసుకుంటుంది’

బెల్జియం కు చెందిన ఒక వ్యక్తి ఆటో బ్రూవరీ సిండ్రోమ్ (ABS)తో బాధపడుతున్నాడు. అంటే, అతడు మద్యం తాగకపోయినా, అతడి శరీరంలో ఆటోమేటిక్ గా మద్యం తయారవుతుంది. దాంతో, అతడు ఎప్పుడు మద్యం సేవించినవాడి వలే ఉండేవాడు. నిజానికి, మొదట్లో మితిమీరి…

Crime news: కన్న కొడుకునే చంపాలని కుట్ర; కాంట్రాక్ట్ కిల్లర్స్ కు సుపారీ ఇచ్చిన తండ్రి

తన కుమారుడిని హత్య చేసేందుకు ఐదుగురు కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్న వ్యక్తిని పుణె నగర క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి కుమారుడైన ధీరజ్ అర్గాడే శివాజీనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది.…

JEE Mains 2024 results: జేఈఈ మెయిన్స్ 2024 తుది ఫలితాలు వెల్లడి; 56 మంది విద్యార్థులకు 100 పర్సంటైల్

జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. జేఈఈ మెయిన్స్ 2024 ఫలితాల్లో 56 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించారు. జేఈఈ మెయిన్స్ 2024 పరీక్షలకు హాజరైన విద్యార్థులందరూ అధికారిక వెబ్సైట్ jeemain.nta.ac.in లో…

Love brain disease: పదేపదే లవర్ కు ఫోన్ చేస్తున్నారా? ‘లవ్ బ్రెయిన్’ జబ్బు ఉందేమో చెక్ చేసుకోండి..!

చైనాలో ఓ మహిళకు ‘లవ్ బ్రెయిన్'(love brain) అనే మానసిక వ్యాధి ఉన్నట్లు తేలింది. తన బాయ్ ఫ్రెండ్ కు ఆమె ఒక రోజులో 100 సార్లకు పైగా ఫోన్ చేసిందని, అతడు ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అని పదేపదే…

Lok sabha elections 2024: ‘హనుమాన్ చాలీసా వినడం నేరమా?’: కర్నాటక ఘటనను గుర్తు చేసిన ప్రధాని మోదీ

Lok sabha elections 2024: రెండో దశ పోలింగ్ లో 13 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జరుగుతున్న రాజస్తాన్ లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్నాటకలో ఇటీవల జరిగిన ఒక ఘటనను ప్రస్తావించారు. హనుమాన్…

heat waves: తీరప్రాంతాల్లో 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా డేంజరే.. హీట్ వేవ్ వెనకున్న సైన్స్ చెప్పేదిదే..

భారత వాతావరణ శాఖ (IMD) గత పక్షం రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాలకు వడగాలుల హెచ్చరికలను పంపింది. సముద్ర తీర ప్రాంత వాతావరణం కారణంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే ముంబై వంటి ప్రాంతాల్లో కూడా వడగాల్పులు వీస్తున్నాయి. అయితే, వడగాల్పులను ముందే…

liquor policy case: లిక్కర్ పాలసీ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, తెలంగాణ ఎమ్మెల్సీ కవితల జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

Delhi liquor policy case: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నాయకురాలు కె కవితల జ్యూడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు…

CDS II Final Results: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఫైనల్ రిజల్ట్స్ ను ప్రకటించిన యూపీఎస్సీ

UPSC CDS II Final Result 2023: యూపీఎస్సీ సీడీఎస్-2 2023 ఫైనల్ ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2) 2023కు హాజరైన అభ్యర్థులు upsc.gov.in వెబ్ సైట్ ద్వారా ఫలితాలను…

Malaysia: ఆకాశంలో రెండు హెలీకాప్టర్లు ఢీ; 10 మంది దుర్మరణం

Malaysia navy helicopters crash: మలేషియాకు చెందిన రెండు సైనిక హెలికాప్టర్లు మంగళవారం ట్రైనింగ్ సెషన్ లో ఢీకొని కూలిపోవడంతో అందులోని 10 మంది సిబ్బంది మృతి చెందారు. మే నెలలో జరిగే నేవీ ఫ్లీట్ ఓపెన్ డే వేడుకల కోసం…

Crime news : మాజీ ప్రియురాలిని డేటింగ్​ చేస్తున్నాడని.. 16ఏళ్ల స్నేహితుడిని చంపిన యువకుడు!

Teen kills friend fo ex girlfriend : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తన మాజీ ప్రియురాలిని స్నేహితుడు డేటింగ్​ చేస్తున్నాడని ఓ వ్యక్తి అనుమానించాడు. సిగరెట్​ తాగుదామని పిలిచి.. ఆ 16ఏళ్ల స్నేహితుడిని కిరాతకంగా పొడిచి, పొడిచి…

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు