Bank of Baroda Recruitment 2023 : బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో ఉద్యోగాలు.. అప్లికేషన్​కు ఇవాళే లాస్ట్​ డే!-bank of baroda recruitment 2023 registration for 250 posts ends today ,జాతీయ

Bank of Baroda Recruitment 2023 notification : దరఖాస్తు ఫీజు:- జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులకు రూ.100. ఆన్ లైన్ పరీక్ష నిర్వహించినా, చేయకపోయినా, ఇంటర్వ్యూకు అభ్యర్థి షార్ట్ లిస్ట్ అయినా,…

Other Story

*కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం* ▪️రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు..! కేంద్రంలో కాంగ్రెస్ ని గెలిపించండి ▪️బీజేపీ, బీఆర్ఎస్ తోడుదొంగల పార్టీలు ▪️ప్రజా ద్రోహుల పాలనను అంతం చేద్దాం!! *➖ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, డిసిసి అధికారప్రతినిధి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత* కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గారికి ఓటు వేసి గెలిపించాలనీ కోరుతూ, గురువారం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో మండల పార్టీ అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి తో కలిసి డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పాల్గొన్నారు. గ్రామంలోని ఉపాధి హామీ కూలీలను కలిసిన అనంతరం వారసంతలో గ్రామస్థులతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును ఓటువేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కంది తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ఈ ఎన్నికలు 10 ఏళ్ల నియంత పాలనకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కూటమికి జరుగుతున్న అతి ముఖ్యమైన ఎన్నికలని, పది సంవత్సరాలనుండి కేంద్రంలో అధికారంలో ఉండి ఇచ్చిన హామీలు నెరవేర్చనీ బీజేపీ పార్టీని బొందపెట్టాలని కంది తిరుపతి రెడ్డి పిలుపునిచ్చారు. ఎంపీగా ఉండి ఈ ప్రాంత ప్రజల వద్దకు ఏనాడూ కూడా రాకుండా మన సమస్యలు పట్టించుకోకుండా మళ్ళీ ఏ మొఖం పెట్టుకొని వస్తున్నారు అని బీజేపీ నాయకులనీ అడగండని ఆయన అన్నారు.‌ మొన్నటి ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ఇప్పటికి ఉచిత బస్సు, ఫ్రీ కరెంటు,500లకే సిలిండర్ అందజేస్తున్నామని, ఆగష్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం అని కంది తిరుపతి రెడ్డి అన్నారు. ఆరు గ్యారంటీలతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పాంచ్ న్యాయ్ హామీలు అమలు చేస్తామని కంది తెలిపారు. డిసిసి అధికారప్రతినిధి దాసరి ప్రవీణ్ కుమార్ నేత మాట్లాడుతూ బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్, వంట నూనె, కందిపప్పు లాంటి నిత్యావసర వస్తువుల మీద విపరీతమైన ధరలు పెంచారని ఆరోపించారు. చేనేత పరిశ్రమల నుండి కుటీర పరిశ్రమల వరకు అన్నింటి పై జీఎస్టీని విధించారని దాసరి ప్రవీణ్ నేత వివరించారు. చివరకు దేవుడిని పూజించడానికి ఉపయోగించే అగరబత్తీల పై కూడా జీఎస్టీని వదల్లేదన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బోయిని నరేష్, గ్రామశాఖ అధ్యక్షుడు గాదెపాక సునీల్, మాజీ ఉపసర్పంచ్ చాడ మహిపాల్ రెడ్డి, రొంటాల లావణ్య, పరుపాటి జయపాల్ రెడ్డి, పిట్టల వెంకటరాజయ్య, దుడ్డెల వెంకన్న, దొడ్ల రమణా రెడ్డి, వర్ణ కొండాల్ రెడ్డి, మున్న రాజు, చందవేని మల్లయ్య, సిద్ది రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు