సాయిపూర్‌లో నూతన బోర్ వెల్ ..!
ఎమ్మెల్యే సహకారంతో బోర్‌వెల్ వేయించిన కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తా.. జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు పోచమ్మ గల్లీ సాయిపూర్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక సహకారంతో, కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్ చొరవ తీసుకొని గురువారం కాలనీలో నూతన బోర్‌వెల్‌ను వేయించారు. బోర్‌వెల్ పడటంతో నీటి కష్టాలు తీరినందుకు కాలనీ మహిళలు, స్థానికులు హర్షం వ్యక్తం...
పెద్దాయన వస్తే చాలు...!
ఎమ్మెల్యే వెనకాలే కౌన్సిలర్లు తాండూరు మున్సిపల్ పరిధిలో ప్రజల ఆగ్రహం వార్డుల వైపు కన్నెత్తి చూడని ప్రజాప్రతినిధులు తెరపైకి 'షాడో' కౌన్సిలర్ల అవతారాలు.. మహిళా కౌన్సిలర్ల భర్తలు, కుటుంబ సభ్యుల హడావుడి గత కొన్ని రోజులుగా పట్టణంలో ఇదే చర్చ....! జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో ప్రజా సమస్యలు తాండవిస్తుంటే, వాటిని పరిష్కరించాల్సిన పాలకులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాండూరు పట్టణ పరిధిలోని పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు తమ స్వంత...
విద్యను వ్యాపారంగా మార్చేశారు..!
ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. పుస్తకాలు, యూనిఫామ్‌ల పేరిట తల్లిదండ్రులపై అదనపు భారం చర్యలు తీసుకోకుంటే ఎంఈఓ ఆఫీస్ ముట్టడి: కౌన్సిలర్ అంతారం కిరణ్ హెచ్చరిక జనవాహిని ప్రతినిధి తాండూరు : విద్యను వ్యాపారంగా మార్చేసారని మున్సిపల్ కౌన్సిలర్ కిరణ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను కట్టడి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తాండూరు మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ అంతారం కిరణ్ ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలమైనా విద్యాశాఖకు...
పాలన చేతకాకనే అక్రమ నిర్బంధాలు..!
నిరుద్యోగులు, విద్యార్థుల హామీలను తక్షణమే అమలు చేయాలి బీఆర్ఎస్వి జిల్లా నాయకుడు దత్తాత్రేయ రావు డిమాండ్ అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తాండూరులో నాయకుల ముందస్తు అరెస్ట్ జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక అక్రమ నిర్బంధాలతో కాలం వెళ్లదీస్తోందని బీఆర్ఎస్వి జిల్లా నాయకుడు దత్తాత్రేయ రావు అన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన ప్రతీ హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.హైదరాబాద్‌లో నిరుద్యోగులు, విద్యార్థి లోకం తలపెట్టిన 'అసెంబ్లీ...
ఘనంగా నూతన కమిటీ ప్రమాణస్వీకారం..!
సల్లా గార్డెన్స్‌లో మర్చంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నూతన కార్యవర్గానికి ఘన సత్కారం జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ పట్టణ గంజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో "ది గ్రెయిన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్" నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం స్థానిక సల్లా గార్డెన్స్‌లో కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు నియోజకవర్గ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఆయన సమక్షంలో అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కట్కం వీరేందర్,...
మున్సిపల్ భూమిని కాపాడాలి..!
52 సర్వే నెంబర్ భూమిపై అక్రమార్కుల కన్ను ఎంఆర్‌ఓకు వినతిపత్రం సమర్పించిన కౌన్సిలర్ అనిల్ కుమార్ జనవాహిని ప్రతినిధి తాండూరు : మాలెడ్డిపల్లి శివారులోని తాండూరు మున్సిపాలిటీకి చెందిన కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమార్కుల బారి నుండి కాపాడాలని 6వ వార్డు కౌన్సిలర్ బి. అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన తాండూరు మండల్ రెవెన్యూ అధికారి ఎంఆర్‌ఓ కి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. మాలెడ్డిపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 52లో మున్సిపల్...
నిర్లక్ష్యపు నీడలో ‘అంబేద్కర్’ విగ్రహ ప్రాంగణం
పట్టించుకోని పంచాయతీ పాలకులు, అధికారులు రైలింగ్ విరిగిపోయినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహారం మరమ్మతులు చేయకుంటే ఆందోళన తప్పదు: యువ నాయకుడు హరీష్ గౌడ్ జనవాహిని ప్రతినిధి తాండూరు : మహనీయుల విగ్రహాల రక్షణ, గౌరవాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు గాలికొదిలేశారు. వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలోని పెర్కంపల్లి గ్రామంలో ప్రతిష్టించిన రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేద్కర్ విగ్రహ ప్రాంగణం అధికారుల, స్థానిక పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తోందని యువ నాయకుడు హరీష్ గౌడ్ అన్నారు. విగ్రహం చుట్టూ రక్షణ...
కాగ్నిబాట్ స్కూల్ ఘనంగా పునఃప్రారంభం
పటాన్చెరు జానవాహిణి ప్రతినిధి జూన్ 17 :- వేసవి సెలవుల అనంతరం కాగ్నిబాట్ స్కూల్ నేడు తిరిగి సందడి వాతావరణంలో పునఃప్రారంభమైంది. కొత్త విద్యా సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పాఠశాల ప్రాంగణం రంగురంగుల అలంకరణలతో కళకళలాడింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంబాబు గారు తమ బృందంతో కలిసి పాఠశాల ప్రధాన ద్వారం వద్ద నిలబడి ప్రతి విద్యార్థిని ఆప్యాయంగా స్వాగతించారు. చిరునవ్వులతో, ప్రేమాభిమానాలతో విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, వారికి మధురమైన ఆతిథ్యాన్ని అందించారు. సెలవుల అనంతరం మళ్లీ తమ స్నేహితులు, ఉపాధ్యాయులను కలుసుకున్న విద్యార్థులు...
తాండూరులో ‘మెథడిస్ట్ యూత్’ స్పోర్ట్స్ ఫెస్ట్
తాండూరులో రేపటి నుండి జిల్లా స్థాయి ‘ఎంవైఎఫ్ క్రీడల పండుగ విలియం మూన్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తి ముఖ్య అతిథిగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హాజరు కానున్నారు. జనవాహిని ప్రతినిధి తాండూరు : పట్టణంలోని విలియం మూన్ మైదానంలో మెథడిస్ట్ యూత్ ఫెలోషిప్ తాండూరు జిల్లా విభాగం ఆధ్వర్యంలో బుధవారం 17వి తేదీ నుండి భారీ జిల్లా స్థాయి స్పోర్ట్స్ ఫెస్ట్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్బంగా...
బుయ్యని దంపతుల ‘మధుర బంధం’.. !
ఆర్బిఓఎల్ సీఈఓ వివాహ వార్షికోత్సవంలో లీడర్ల కోలాహలం హోరెత్తిన శుభాకాంక్షలు.. స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన వేడుక జనవాహిని ప్రతినిధి తాండూరు : నిత్యం వ్యాపార సమీక్షలు, సామాజిక సేవా కార్యక్రమాలతో బిజీగా ఉండే ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి - సరళ రెడ్డి దంపతుల జీవితంలో మరో మధుర ఘట్టం ఆవిష్కృతమైంది. వారి వివాహ వార్షికోత్సవ వేడుకలు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో ఎంతో ముచ్చటగా జరిగాయి.శ్రీనివాస్ రెడ్డి దంపతుల వివాహ బంధం మరెందరికో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తూ.. పట్టణ...












