HomeNewsతాండూరులో ‘మెథడిస్ట్ యూత్’ స్పోర్ట్స్ ఫెస్ట్

తాండూరులో ‘మెథడిస్ట్ యూత్’ స్పోర్ట్స్ ఫెస్ట్

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • తాండూరులో రేపటి నుండి జిల్లా స్థాయి ‘ఎంవైఎఫ్ క్రీడల పండుగ
  • విలియం మూన్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తి
  • ముఖ్య అతిథిగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హాజరు కానున్నారు.

జనవాహిని ప్రతినిధి తాండూరు : పట్టణంలోని విలియం మూన్ మైదానంలో మెథడిస్ట్ యూత్ ఫెలోషిప్ తాండూరు జిల్లా విభాగం ఆధ్వర్యంలో బుధవారం 17వి తేదీ నుండి భారీ జిల్లా స్థాయి స్పోర్ట్స్ ఫెస్ట్ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్బిఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్బంగా మెథడిస్ట్ యూత్ ఫెలోషిప్ పోస్టర్ ను జిల్లా మేతడిస్ట్ సభ్యులు జోగుల ఎబినైజర్ ఆధ్వర్యంలో.. మంగళవారం బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ మేరకు డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ రెవ. కె. జనార్ధన్, యూత్ డైరెక్టర్ రెవ. జోయల్ ఇమ్మానుయేల్, డిస్ట్రిక్ట్ లే లీడర్ యేసుదాస్ సంయుక్తంగా వివరాలు వెల్లడించారు.క్రైస్తవ యువతలో ఐక్యత, క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఇందులో భాగంగా క్రికెట్, వాలీబాల్, మహిళలకు ప్రత్యేకంగా త్రోబాల్ పోటీలతో పాటు క్యారమ్స్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్ పోటీలు జరగనున్నాయి. పాల్గొనే క్రీడాకారులందరికీ ప్రశంసా పత్రాలు అందజేస్తామన్నారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల గడువు ముగిసిందని, జట్లు సకాలంలో మైదానానికి చేరుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 8317510172, 7794982494 నంబర్లను సంప్రదించవచ్చన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments