HomeNewsసాయిపూర్‌లో నూతన బోర్ వెల్ ..!

సాయిపూర్‌లో నూతన బోర్ వెల్ ..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  •  ఎమ్మెల్యే సహకారంతో బోర్‌వెల్ వేయించిన కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్
  •  ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తా..

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు పోచమ్మ గల్లీ సాయిపూర్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న తాగునీటి సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక సహకారంతో, కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్ చొరవ తీసుకొని గురువారం కాలనీలో నూతన బోర్‌వెల్‌ను వేయించారు. బోర్‌వెల్ పడటంతో నీటి కష్టాలు తీరినందుకు కాలనీ మహిళలు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్ మాట్లాడుతూ.. సాయిపూర్ ప్రాంతంలో చాలా కాలంగా రోడ్డు, తాగునీటి వసతి లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించి సహకారం అందించారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని, నిరంతరం ప్రజల పక్షాన ఉంటూ వార్డు అభివృద్ధికి శ్రమిస్తానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్ల నాటి సమస్యను చొరవ చూపి పరిష్కరించినందుకు కాలనీవాసులు ఎమ్మెల్యేకు, పట్లోళ్ల ప్రశాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments