HomeNewsఅభివృద్ధిపై చర్చ వదిలి.. అడ్డగోలు విమర్శలా?

అభివృద్ధిపై చర్చ వదిలి.. అడ్డగోలు విమర్శలా?

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • ఎమ్మెల్యే వ్యాఖ్యలు అహంకారపూరితం…! 
  •  అభివృద్ధిపై చర్చ వదిలి వ్యక్తిగత దూషణలా?
  • రోహిత్ రెడ్డి చేసిన అభివృద్ధి కనబడటం లేదా?
  •  వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారు: రాజు గౌడ్ హెచ్చరిక
  • మరింత సమాచారం కింద వీడియో లో చూడండి….!

తాండూరు జనవాహిని ప్రతినిధి: మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చుకుని, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు రాజు గౌడ్ తీవ్రంగా ఖండించారు. గురువారం బిఆర్ఎస్ నాయకులు మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, నరేందర్ గౌడ్, రుద్రు పాటిల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే తీరుపై నిప్పులు చెరిగారు.బిడ్డ.. సినిమా ముందుంది అంటూ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారానికి నిదర్శనమని రాజు గౌడ్ మండిపడ్డారు. గత ఐదేళ్ల కాలంలో పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో తాండూరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పనలో ఆయన కృషి మరువలేనిదని గుర్తు చేశారు. కరోనా వంటి విపత్కర సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రోహిత్ రెడ్డి అహర్నిశలు శ్రమించారని, అప్పుడు ఇక్కడ లేను ఎమ్మెల్యే ఇప్పుడు విమర్శలు చేయడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.రాజకీయాలను వ్యాపారంగా చూస్తున్నది ఎవరో ప్రజలకు బాగా తెలుసని రాజు గౌడ్ అన్నారు. దుకాణం బంద్ చేస్తా అన్న ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందిస్తూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎవరి దుకాణానికి తాళం వేస్తారో వేచి చూడాలి అని సవాల్ విసిరారు. ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేకనే రోహిత్ రెడ్డిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.గత సర్పంచ్ ఎన్నికల్లో టీజర్ చూపించాం, మున్సిపల్ ఎన్నికల్లో సినిమా చూపించాం… ఇక రానున్న ఎన్నికల్లో ఏకంగా క్లైమాక్స్ చూపిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళైనా నియోజకవర్గానికి కొత్తగా తెచ్చిన నిధులు ఏవో ఎమ్మెల్యే చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీలోని విభేదాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్షంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని రాజు గౌడ్ హెచ్చరించారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments