HomeNewsఘనంగా నూతన కమిటీ ప్రమాణస్వీకారం..!

ఘనంగా నూతన కమిటీ ప్రమాణస్వీకారం..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • సల్లా గార్డెన్స్‌లో మర్చంట్స్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం
  • ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
  • నూతన కార్యవర్గానికి ఘన సత్కారం

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ పట్టణ గంజ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “ది గ్రెయిన్ అండ్ సీడ్స్ మర్చంట్స్ అసోసియేషన్” నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం స్థానిక సల్లా గార్డెన్స్‌లో కన్నులపండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాండూరు నియోజకవర్గ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఆయన సమక్షంలో అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కట్కం వీరేందర్, ఉపాధ్యక్షులుగా బానకారి క్రిష్ణ, కార్యదర్శిగా దర్మీది ప్రభు, సహా కార్యదర్శులుగా నాగారం జగదీశ్వర్, కోశాధికారిగా సిహెచ్ భోజిరెడ్డిలతో పాటు కార్యవర్గ సభ్యులుగా ఎన్. జైపాల్ రెడ్డి, కల్వ రాధాకృష్ణ, బంటారం సుధాకర్, చామ్‌కూర్ విశ్వనాథ్, బిక్కుమళ్ల శ్రీధర్, రాజేష్ సోని, దీనేష్‌ సింగ్, మంకాల రవీందర్, టి.బాలేశ్వర్ గుప్త, మల్లేపల్లి మధుసూదన్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తాండూరు వ్యాపార రంగానికి గంజ్ అసోసియేషన్ ఒక గుండెకాయ లాంటిదని, రైతులు-వర్తకుల మధ్య సమన్వయం సాధించడంలో అసోసియేషన్ పాత్ర కీలకమైనదని కొనియాడారు. నూతన బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులు వ్యాపారుల సమస్యల పరిష్కారానికి, గంజ్ మరింత పురోగతి సాధించడానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక వర్తక రంగానికి, గంజ్ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం తరపున తన వంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.నూతన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments