HomeNewsపాలన చేతకాకనే అక్రమ నిర్బంధాలు..!

పాలన చేతకాకనే అక్రమ నిర్బంధాలు..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • నిరుద్యోగులు, విద్యార్థుల హామీలను తక్షణమే అమలు చేయాలి
  • బీఆర్ఎస్వి జిల్లా నాయకుడు దత్తాత్రేయ రావు డిమాండ్
  • అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో తాండూరులో నాయకుల ముందస్తు అరెస్ట్

జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతకాక అక్రమ నిర్బంధాలతో కాలం వెళ్లదీస్తోందని బీఆర్ఎస్వి జిల్లా నాయకుడు దత్తాత్రేయ రావు అన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన ప్రతీ హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.హైదరాబాద్‌లో నిరుద్యోగులు, విద్యార్థి లోకం తలపెట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ కార్యక్రమం నేపథ్యంలో పోలీసులు గురువారం తెల్లవారుజాము నుంచే ముందస్తు అరెస్టుల పర్వానికి తెరలేపారు. ఇందులో భాగంగా తాండూరులోని వారి నివాసాల్లో ఉన్న బీఆర్ఎస్వి జిల్లా నాయకులు దత్తాత్రేయ రావు, వినోద్ కుమార్‌లను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతరం వారిని తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. నిరుద్యోగులు తమ న్యాయమైన హక్కుల కోసం, ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం శాంతియుతంగా పోరాడుతుంటే అక్రమ అరెస్టులతో అణచివేయాలని చూడడం దుర్మార్గమన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అక్రమంగా నిర్బంధించినా నిరుద్యోగుల పోరాటాన్ని ఆపలేరని హెచ్చరించారు. విద్యార్థి, నిరుద్యోగ విభాగాలు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments