Friday, June 19, 2026

― Advertisement ―

సాయిపూర్‌లో నూతన బోర్ వెల్ ..!

 ఎమ్మెల్యే సహకారంతో బోర్‌వెల్ వేయించిన కాంగ్రెస్ నాయకుడు పట్లోళ్ల ప్రశాంత్  ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రమిస్తా.. జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు పోచమ్మ గల్లీ...
HomeNEWSవిద్యను వ్యాపారంగా మార్చేశారు..!

విద్యను వ్యాపారంగా మార్చేశారు..!

spot_img
  • ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి
  •  రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు.
  •  పుస్తకాలు, యూనిఫామ్‌ల పేరిట తల్లిదండ్రులపై అదనపు భారం
  • చర్యలు తీసుకోకుంటే ఎంఈఓ ఆఫీస్ ముట్టడి: కౌన్సిలర్ అంతారం కిరణ్ హెచ్చరిక

జనవాహిని ప్రతినిధి తాండూరు :    విద్యను వ్యాపారంగా మార్చేసారని మున్సిపల్ కౌన్సిలర్ కిరణ్ అన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులను కట్టడి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తాండూరు మున్సిపాలిటీ 23వ వార్డు కౌన్సిలర్ అంతారం కిరణ్ ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలమైనా విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని నియమించకపోవడం చాలా సిగ్గుచేటని ఆయన విమర్శించారు. తాండూరు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల అధిక ఆర్థిక భారం మోపుతున్నాయని మండిపడ్డారు. కేవలం ఫీజులే కాకుండా… పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫార్ములు మరియు ఇతర విద్యా సామగ్రిని కూడా తాము చెప్పిన నిర్దిష్ట దుకాణాల నుండి లేదా పాఠశాలల నుంచే కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను బలవంతం చేస్తున్నారని ఆరోపించారు.రాజ్యాంగం ప్రకారం విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు అయినప్పటికీ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు లాభార్జనే ధ్యేయంగా విద్యను పూర్తి వ్యాపారంగా మార్చేశాయని కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యాల ఇష్టారాజ్యంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా కోలుకోలేని విధంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. తాండూరు విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా నిద్రమత్తు వీడి వెంటనే స్పందించాలని ఆయన కోరారు. పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పుస్తకాలు, యూనిఫార్ములు ఒకే చోట కొనాలనే ఒత్తిడి చేసే విధానాన్ని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు.అధికారులు స్పందించి చర్యలు తీసుకోని పక్షంలో, తాండూర్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరపున ఎంఈఓ ఆఫీస్‌ను ముట్టడించడానికి కూడా వెనకాడబోమని అంతారం కిరణ్ స్పష్టం చేశారు.