పెద్దేముల్: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తాండూరు నియోజకవర్గ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కన్వీనర్ కరణం పురుషోత్తం రావు పిలుపునిచ్చారు. పెద్దేముల్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో కొనసాగుతున్న SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కరణం పురుషోత్తం రావు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి, బీఎల్ఓలు (BLOలు), బీఎల్‌ఏలు (BLAలు) నిర్వహిస్తున్న ఓటరు నమోదు, సవరణ ప్రక్రియను పర్యవేక్షించారు. బూత్ స్థాయి అధికారుల ద్వారా ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు స్వయంగా అందజేశారు. పరిశీలించిన బూత్‌ల వివరాలు: తట్టేపల్లి:బూత్ నంబర్లు 6–9, ఓమ్లా నాయక్ తండా:బూత్ నంబర్ 05, అడ్కిచెర్ల:బూత్ నంబర్ 02,పాషాపూర్:బూత్ నంబర్ 03, జైరాం తండా:బూత్ నంబర్ 04,పెద్దేముల్ మండల కేంద్రం:బూత్ నంబర్లు 25–29, అధికారులకు, ప్రజలకు కీలక సూచనలు అర్హులైన ప్రతి ఒక్కరి పేరును ఓటరు జాబితాలో నమోదు చేసేలా అధికారులు పారదర్శకంగా, సమర్థవంతంగా విధులు నిర్వహించాలి. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఖచ్చితంగా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలి. ప్రజలందరూ ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి వివరాలతో నింపి అధికారులకు సమర్పించాలని కోరారు.ఓటర్ల సవరణ ప్రక్రియ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరూ SIR కార్యక్రమానికి సహకరించాలని పిలుపునిచ్చారు.ఈ క్షేత్రస్థాయి పరిశీలన కార్యక్రమంలో పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, జిల్లా మత్స్యశాఖ సహకార సంఘం అధ్యక్షుడు శ్రీధర్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కె. గోపాల్ రెడ్డి, రియాజ్, యెల్లరెడ్డి, సురేష్, డివై నర్సిములు పాల్గొన్నారు. వీరితో పాటు స్థానిక సర్పంచులు, మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఎల్ఓలు, బీఎల్‌ఏలు, గ్రామ నాయకులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
SIR కార్యక్రమంలో ఇంటింటి ఓటరు సవరణను పరిశీలించిన కరణం పురుషోత్తం రావు












Leave a Reply