spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY

“సర్” పేరుతో బిజెపి వ్యతిరేక ఓట్లను తొలగించే కుట్రలను అడ్డుకోవాలి……!

బూత్ లెవెల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి

సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్

సిపిఐ ఎం శాఖ కార్యదర్శుల సమావేశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

జనవాహిణి ప్రతినిధి

భద్రాచలం:- బిజెపి వ్యతిరేక మైనార్టీ గిరిజన దళిత క్రిస్టియన్ ఓట్లను తొలగించేందుకు చేపట్టిన సర్ ప్రక్రియ పట్ల బూతు లెవెల్ ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సిపిఐ ఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక చందర్రావు భవనంలో సిపిఐఎం భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన సిపిఐ ఎం శాఖ కార్యదర్శిల సమావేశానికి ఏజే రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఇప్పటివరకు సర్ జరిగిన రాష్ట్రాలలో భారీగా ఓట్లు గల్లంతయాయని అన్నారు. పశ్చిమ బెంగాల్ తమిళనాడు రాష్ట్రాలలో లక్షలాది ఓట్లను తొలగించి బిజెపి కూటమి పార్టీలు లబ్ది పొందాయని ఏజే రమేష్ ఆరోపించారు. బిజెపి కనుసైగల్లోనే ఎన్నికల కమిషన్ పనిచేస్తుందనటానికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. అర్హత కలిగిన ఓట్లను కాపాడుకునేందుకు బూతు లెవెల్ ఏజెంట్లే కీలకమని ఏజే రమేష్ స్పష్టం చేశారు. ఏమ్యూనిషన్ పారాల పంపిణీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో పార్టీ శ్రేణులు బూతులు ఏజెంట్లు ప్రతి ఓటర్ కి ఫారాలు అందేలా కృషి చేయాలని కోరారు. 90 రోజులు జరిగే సర్ ప్రక్రియలో ఏమాత్రం అలసత్వం వహించరాదని పార్టీ శ్రేణులకు ఏజే రమేష్ సూచించారు. బిజెపి సర్కార్ చేపట్టిన కుట్రలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని రాష్ట్రంలో అర్హులైన ఓటర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై కూడా ఉందని ఏజే రమేష్ స్పష్టం చేశారు. సర్ పేరుతో స్కీం వర్కర్లను ఉన్నత అధికారులు వేధింపులకు గురి చేయటం సరికాదని అన్నారు. అంగన్వాడి వివోఏ తదితర కార్మికులు తమ విధులు నిర్వహిస్తూనే సమగ్ర ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో పని చేపించడం సరైనది కాదని అన్నారు. పని ఒత్తిడి తట్టుకోలేక స్కీం వర్కర్లు ఇబ్బందులకు గురవుతున్నారని ఏజే రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు బండారు శరత్ బాబు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పారెల్లి సంతోష్ కుమార్ డి సీతాలక్ష్మి పట్టణ కమిటీ సభ్యులు నాదెండ్ల లీలావతి జీవనజ్యోతి ఉస్తెల జ్యోతి కొలగాని రమేష్ ధనకొండ రాఘవయ్య కుంజా శ్రీనివాస్ సండ్ర భూపేంద్ర కనక శ్రీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments