HomeNewsపోలియో రహిత సమాజమే లక్ష్యం..!

పోలియో రహిత సమాజమే లక్ష్యం..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • తాండూరు మున్సిపాలిటీలో పల్స్ పోలియో కార్యక్రమం
  • 26వ వార్డులో పోలియో చుక్కలు వేసిన కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 26వ వార్డులో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రానికి వచ్చిన పలువురు చిన్నారులకు ఆమె స్వయంగా పోలియో చుక్కలు వేశారు.అనంతరం కౌన్సిలర్ వైశాలి రాజు గౌడ్ మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు అయిన చిన్నారుల ఆరోగ్యంపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలన్నారు. ఐదేళ్ల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు. గతంలో చుక్కల మందు వేయించినప్పటికీ, ప్రభుత్వం నిర్వహించే ఇటువంటి ప్రత్యేక డ్రైవ్‌లలో మళ్లీ వేయించడం వల్ల పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని అవగాహన కల్పించారు. వార్డులో ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేసుకోకుండా మిగిలిపోకూడదనే లక్ష్యంతో వైద్య సిబ్బంది, అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు శ్రమిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ రోజు పోలియో కేంద్రాలకు రాలేని వారి కోసం రాబోయే రెండు రోజుల పాటు సిబ్బంది ఇంటింటికీ తిరిగి చుక్కల మందు వేస్తారని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కార్యకర్తలు, వార్డు ప్రముఖులు మరియు తల్లులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments