HomeNewsశ్రీనన్న ప్రోత్సాహమే నన్ను నిలిపింది..!

శ్రీనన్న ప్రోత్సాహమే నన్ను నిలిపింది..!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • శ్రీనన్న ప్రోత్సాహమే నన్ను విజేతగా నిలిపింది
  •  అంతర్జాతీయ సెయిలింగ్ కాంస్య పతక విజేత ఎర్రా హర్షవర్ధన్
  •  క్రీడాకారుడిని అభినందించిన ఆర్‌బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు : అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి నాకు లభించిన ఆర్థిక సహాయం కన్నా.. శ్రీనన్న అందించిన ఆత్మీయ ప్రోత్సాహమే నన్ను విజేతగా నిలిపింది అని అంతర్జాతీయ సెయిలింగ్ కాంస్య పతక విజేత ఎర్రా హర్షవర్ధన్ పేర్కొన్నారు.పెద్దేముల్ మండలం గాజీపూర్ గ్రామానికి చెందిన రైతు కుమారుడైన హర్షవర్ధన్ మలేషియాలోని లంఖావిలో జరిగిన అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో భారతదేశం తరపున కాంస్య పతకం సాధించి తాండూరు ఖ్యాతిని చాటాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల పోటీలకు వెళ్లలేని స్థితిలో ఉన్న హర్షవర్ధన్‌ను ఆర్‌బీఓఎల్ సంస్థ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి గుర్తించి, లక్షా యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందించి వెన్నుతట్టారు.శ్రీనన్న నమ్మకాన్ని నిలబెడుతూ దేశానికి పతకం తెచ్చిన హర్షవర్ధన్‌ను శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. తన ప్రతిభను గుర్తించి కొండంత అండగా నిలిచిన శ్రీనన్నకు హర్షవర్ధన్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments