HomeNewsచింతకాని సభా స్థలిని పరిశీలించిన మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు

చింతకాని సభా స్థలిని పరిశీలించిన మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY

రైతు ఆశీర్వాద సభ విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు

చింతకాని సభా స్థలిని పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా  ఎమ్మెల్యే లు

ఖమ్మం జిల్లా

జనవాహిణి ప్రతినిధి

చింతకాని మండలం, మధిర నియోజకవర్గం, ఖమ్మం జిల్లా ఈ నెల జూన్ 30న నిర్వహించనున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి రైతు ఆశీర్వాద సభ విజయవంతానికి చేపడుతున్న ఏర్పాట్లను చింతకాని సభా స్థలిలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.

ఈ సందర్భంగా సభా ప్రాంగణం, పార్కింగ్, తాగునీరు, భద్రత, రవాణా మరియు రైతుల కోసం కల్పిస్తున్న సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే శ్రీ తెల్లం వెంకట్రావు, ఎమ్మెల్యే శ్రీ కోరం కనకయ్య, ఎమ్మెల్యే శ్రీ జారే ఆదినారాయణ, ఎమ్మెల్యే శ్రీ రామ్ దాస్ నాయక్, ఎమ్మెల్యే శ్రీమతి మట్టా రాగమయి పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments