HomeNewsనేడే సవరమ్మ తల్లి జాతర...!

నేడే సవరమ్మ తల్లి జాతర…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • దేవినగర్ శివాజీ చౌక్ ఆలయంలో 31వ వార్షికోత్సవ వేడుకలు
  • అమ్మవారికి పల్లకి సేవ, ఊరేగింపు, అన్నదానం

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణంలోని దేవినగర్ శివాజీ చౌక్ శ్రీ మాత సవరమ్మ దేవస్థానంలో మంగళవారం 31వ వార్షికోత్సవ బోనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 4 గంటలకే సుప్రభాతం, మహాఅభిషేకం, విశేష అలంకరణ పూజలు ప్రారంభంమైయాయి. ఉదయం 9 గంటలకు మహా మంగళహారతి, మధ్యాహ్నం 12 గంటలకు భక్తులచే బోనాల సమర్పణ, ఒంటి గంటకు అన్నప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. సాయంత్రం 4 గంటలకు సవరమ్మ తల్లి పల్లకి సేవ, పురవీధుల గుండా ఊరేగింపు కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 8 గంటలకు మహా మంగళహారతి, 9 గంటలకు ఊయ్యాల సేవతో వేడుకలు ముగుస్తాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments