Krishna mukunda murari serial april 25th episode: ఇంట్లో అందరూ తనని ఏంటో అపురూపంగా చూసుకుంటున్నారని కృష్ణ సంతోషంగా చెప్తుంది. కానీ మురారి మాత్రం కృష్ణ మొహం కూడా చూడకుండా దిక్కులు చూస్తూ మాట్లాడకుండా ఉంటాడు. అసలు ఏమైంది మీకు మాట్లాడకుండా తప్పించుకుని తిరుగుతున్నారని అంటుంది.

కృష్ణ మీద అరిచిన మురారి

మందు తాగారా ఎందుకు తాగారని కోపంగా నిలదీస్తుంది. మురారి గట్టిగా అరుస్తూ అవును నా బాధ ఎవరితో పంచుకోలేక తాగాను అంటాడు. అంత బాధ ఏముంది, ఒక్కరే మథన పడాల్సిన అవసరం ఏముంది? ఏమైంది ఏసీపీ సర్ మీరు ఇంతగా బాధపడటం ఎప్పుడు చూడలేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏడుపు వస్తుందని అంటుంది.

ఏం లేదు కృష్ణ నువ్వు కడుపు నొప్పితో విలవిల్లాడావు కదా అది గుర్తు వచ్చి ఏడుపు వచ్చేస్తుంది. నీకు ఏదైనా అయితే తట్టుకోలేనని అంటాడు. అసలు నాకు ఏం అవుతుందని అంటుంది. కానీ మురారి ఏం లేదని చెప్పి వెళ్ళి పడుకుంటాడు. కృష్ణ చాలా బాధపడుతుంది.

ఆదర్శ్ దగ్గరకు ముకుంద వస్తుంది. లవ్ ప్రపోజ్ చేయడం కోసం తెగ తంటాలు పడతాడు. అటుగా వెళ్తున్న కృష్ణ, మురారి వాళ్ళని చూస్తారు. ఆదర్శ్ మోకాళ్ళ మీద కూర్చుని గులాబీలు ఇస్తూ ఐలవ్యూ ముకుంద అని ప్రపోజ్ చేస్తాడు. ముకుంద షాకింగ్ గా చూస్తూ ఉంటుంది.

పెళ్లి చేసుకుందామా ముకుంద

నిన్ను మొదటి సారి చూసినప్పుడే నాలో ఏదో తెలియని ఫీలింగ్. నన్ను వదిలి వెళ్ళిపోయిన ముకుంద నాకోసం తిరిగి వచ్చినట్టు అనిపించింది. నువ్వు వచ్చాక ముకుంద పోయిన బాధలో నుంచి బయట పడ్డాను. నీకోసం మళ్ళీ హిమాలయాలకు వెళ్లాలనుకున్న వాడిని ఆగిపోయాను.

నువ్వు వచ్చాక నేను మళ్ళీ మామూలు మనిషిని అయ్యాను. అందుకే నాకు ఇష్టమైన ముకుంద పేరు పెట్టాను. నువ్వు లేకపోతే మళ్ళీ ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది. నువ్వు నాకు కావాలి. నువ్వు సరే అంటే మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఐలవ్యూ సోమచ్ ముకుంద అంటాడు.

కృష్ణ కోపంగా వచ్చి ఆదర్శ్ చేతిలోని గులాబీలు నేలకేసి కొడుతుంది. ఏం చేస్తున్నావ్ కృష్ణ అని ఆదర్శ్ అరుస్తాడు. నువ్వు ఏం చేస్తున్నావ్ అంటుంది. ముకుంద అంటే నాకు ఇష్టం అందుకే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను నీకేంటి నష్టం అంటాడు.

ముకుంద పేరే వినిపించకూడదు

నాకు కాదు ఈ కుటుంబానికి నష్టం. మీరాకి ముకుంద అని పేరు పెట్టడమే నువ్వు చేసిన పెద్ద తప్పు. అది నా ఇష్టం నాకు నచ్చిన మనిషికి నాకు నచ్చిన పేరు పెట్టుకుంటానని అంటాడు. నీకు నచ్చినట్టు పెట్టుకోవడానికి నువ్వు హిమాలయాల్లో లేవు కుటుంబంలో ఉన్నావు.

నువ్వు తీసుకునే ఏ నిర్ణయం అయినా కుటుంబానికి కీడు చేసేదిగా ఉండకూడదని అంటుంది. మురారి కూడా కృష్ణకి సపోర్ట్ చేస్తాడు. నేను ముకుందని పెళ్లి చేసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటని ఆదర్శ్ కోపంగా అడుగుతాడు. ముకుంద అనొద్దు మీరా తను ముకుంద కాదు.

ముకుంద మాట ఈ ఇంట్లో వినపడటానికి వీల్లేదు. మీరా గురించి ఏం తెలుసని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావ్. ముందు ఇంట్లో వాళ్ళని అడగాలి. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే వదిలేయాలి అని కృష్ణ అనేసరికి ఆదర్శ్ నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేస్తాడు. అంటే ఇదంతా ఆదర్శ్ కల.

మురారి పెళ్ళాన్ని అవుతా

కృష్ణ ఎందుకు అడ్డుకుంటుంది. నేను సంతోషంగా ఉండటం ఇష్టం లేదు కదా అందుకే అడ్డుకుంటుందని అనుకుంటాడు. ఇప్పుడే వెళ్ళి ముకుందకి తన ప్రేమ సంగతి చెప్పాలని అనుకుంటాడు. ముకుంద డైరీ రాసుకుంటుంది. ఇంకో నాలుగు రోజుల్లో కృష్ణకి ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తారు.

ఇంక ఏం చేసినా కృష్ణకి పిల్లలు పుట్టే ఛాన్స్ ఉండదు. ఇక ఈరోజు నుంచి కృష్ణ గొడ్రాలు అనే నినాదాన్ని అందరిలో స్ప్రెడ్ చేస్తాను. కృష్ణ మీద ఉన్న ఇష్టాన్ని అయిష్టంగా మార్చి నా మీద ఇష్టం పెరిగేలా చేసుకుంటాను. ఇది నా అజెండా అని ముకుంద నవ్వుకుంటుంది.

ఈ ప్లాన్ సక్సెస్ అవుతుంది. అప్పుడు నేను మురారి మనిషిని అవుతాను కాదు మురారి పెళ్ళాన్ని అవుతాను అనుకుంటుంది. ఆదర్శ్ రాగానే కంగారుగా ముకుంద డైరీ దాచి పెట్టేస్తుంది. ఏంటి దాస్తున్నావ్ అని అడుగుతాడు. రోజు పడుకునే ముందు డైరీ రాసే అలవాటు ఉందని చెప్తుంది.

పులిహోర రాజా వచ్చాడు

ఆదర్శ్ మళ్ళీ ముకుందతో పులిహార కలుపుతాడు. బాగా ఆలోచించాను నీకోక విషయం చెప్పాలని అనుకుంటున్నానని అంటాడు. ఏం చెప్తాడా అని ముకుంద టెన్షన్ పడుతుంది. ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఆదర్శ్ అంటే ఇప్పుడు కాదు రేపు జాగింగ్ కి వస్తాను అప్పుడు మాట్లాడుకుందామని పంపించేస్తుంది.

ఈయన వాలకం చూస్తుంటే ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. ఈయనకి ఒంటరిగా దొరకకూడదు, దొరికినా మాట్లాడే ఛాన్స్ ఇవ్వకూడదని అనుకుంటుంది. కృష్ణ రాత్రంతా నిద్రపోకుండా మురారి ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆదర్శ్ సంతోషంగా జాగింగ్ కి రెడీ అయి రావడం ముకుంద చూసి వెంటనే డోర్ వేసుకుంటుంది.

తరువాయి భాగంలో..

కృష్ణ వేరే డాక్టర్ దగ్గరకు వెళ్తుంది. నార్మల్ గా వచ్చే కడుపు నొప్పి కదా అసలు వాళ్ళు ఏం దాచారని కృష్ణ డాక్టర్ ని అడుగుతుంది. రిపోర్ట్ లో ఏముందని అంటుంది. నీ గర్భసంచి పూర్తిగా డ్యామేజ్ అయ్యింది ఇక నీకు పిల్లలు పుట్టకపోవచ్చని డాక్టర్ చెప్తుంది. ఇదంతా ముకుంద చాటుగా చూస్తుంది. కృష్ణ రిపోర్ట్స్ చూసి ఏడుస్తుంది. మురారి వచ్చి ఏమైందని అంటే నా గర్భసంచి పోయింది ఏసీపీ సర్ అంటుంది. పిల్లలు పుట్టరని కుమిలి కుమిలి ఏడుస్తుంది.