Guppedantha Manasu Today Episode: మ‌హేంద్ర కార‌ణంగా తాను ప‌డ్డ అవ‌మానాలు భ‌రించ‌లేక మ‌ను అత‌డిని గ‌న్‌తో షూట్ చేసిన‌ట్లుగా అనుప‌మ క‌ల కంటుంది. ఆ క‌ల కార‌ణంగా భ‌యంతో ఒక్క‌సారిగా నిద్ర‌లో నుండి మేల్కొంటుంది. వ‌సుధార నిజం బ‌య‌ట‌పెడితే క‌ల‌లో జ‌రిగిన‌ట్లే మ‌హేంద్ర‌ను మ‌ను నిజంగానే షూట్ చేస్తాడు కావ‌చ్చున‌ని అనుప‌మ భ‌య‌ప‌డుతుంది.

త‌న‌కు వ‌చ్చిన క‌ల మొత్తం వ‌సుధార‌కు చెప్పేస్తుంది. మ‌ను తండ్రి మ‌హేంద్ర‌నే అనే నిజం ఎప్ప‌టికీ బ‌య‌ట‌పెట్టొద్ద‌ని వ‌సుధార‌ను రిక్వెస్ట్ చేస్తుంది. మ‌నుకు త‌న తండ్రిపై చాలా ద్వేషం ఉంద‌ని, నిజం తెలిస్తే ఖ‌చ్చితంగా ఆవేశంతో మ‌నును షూట్ చేసినా చేస్తాడ‌ని వ‌సుధార‌తో అంటుంది అనుప‌మ‌.

రాజీవ్ ప్లాన్‌…

మ‌నుకు వ‌సుధార ఫోన్ చేస్తుంది. ఆమె ఎన్నిసార్లు ఫోన్ చేసిన మ‌ను లిఫ్ట్ చేయ‌డు. ఆమె కాల్స్ అవైడ్ చేస్తుంటాడు. ఇంత‌లోనే మ‌నుకు రాజీవ్ కొత్త నంబ‌ర్ నుంచి ఫోన్ చేస్తాడు. మీ తండ్రి ఎవ‌రో త‌న‌కు తెలుసున‌ని అంటాడు. శైలేంద్ర‌నే ఈ ఫేక్ కాల్ చేశాడ‌ని మ‌ను అనుకుంటాడు. కానీ తాను శైలేంద్ర‌ను కాద‌ని, తాను చెప్పిన ప్లేస్‌కు వ‌స్తే మీ తండ్రి ఎవ‌రో చెబుతాన‌ని మ‌నుతో అంటాడు రాజీవ్‌.

మ‌హేంద్ర ఫేస్ మాస్క్‌తో…

రాజీవ్ చెప్పిన ప్లేస్‌కు మ‌ను వ‌స్తాడు. మ‌హేంద్ర ఫేస్ మాస్క్ వేసుకొని అత‌డి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాడు రాజీవ్‌. మాస్క్‌లో క‌నిపిస్తోన్న వ్య‌క్తే మీ నాన్న అని చెబుతాడు. తొంద‌ర‌లోనే ఇత‌డు నిన్ను ద‌త్త‌త తీసుకుంటున్నాడు క‌దా. ద‌త్త‌త తీసుకుంటే నీకు నాన్న అవుతాడుగా అంటూ త‌న ఫేస్ మాస్క్ తీసేస్తాడు. రాజీవ్‌ను చూసి మ‌ను షాక‌వుతాడు. నా ఎమోష‌న్స్‌తోనే ఆడుకుంటావా అంటూ రాజీవ్‌పై ఫైర్ అవుతాడు.

వ‌సు నా ప్రాణం…

వ‌సు విష‌యంలో త‌న గుండెను ఎన్నో సార్లు ముక్క‌లు చేశావ‌ని, త‌న ఎమోష‌న్స్‌తో ఆడుకున్నావ‌ని మ‌నుతో అంటాడు రాజీవ్‌. వ‌సు త‌న హార్ట్‌, ల‌వ్ అని చెబుతాడు. త‌న గుండె ఎప్పుడు వ‌సు..వ‌సు అని కొట్టుకుంటుంది. వ‌సు అంటే అంత పిచ్చి నాకు అని మ‌నుకు చెబుతాడు రాజీవ్‌. వ‌సు కోసం తాను చ‌నిపోవ‌డానికైనా సిద్ధ‌మ‌ని చెబుతాడు. వ‌సును నాకు ద‌క్క‌కుండా చేస్తున్నావు. దూరం చేస్తున్నావ‌ని మ‌నుకు వార్నింగ్ ఇస్తాడు రాజీవ్‌.

మ‌ను వార్నింగ్‌…

ఓ అమ్మాయి ఛీ కొడుతున్నా…ఇంకా వెంట‌ప‌డుతున్నావంటే నీ అంత వెధ‌వ లేద‌ని రాజీవ్‌ను ఛీత్క‌రించుకుంటాడు మ‌ను. లోకంలో నీ అంత దుర్మార్గుడు లేడ‌ని అంటాడు. నాపై ఎలాంటి ముద్ర‌లు వేసినా ఒప్పుకుంటా..కానీ నాకు వ‌సు కావాలి. నా దారికి అడ్డురావొద్ద‌ని మ‌నును హెచ్చ‌రిస్తాడు రాజీవ్‌.

ఇంకోసారి నాకు ఫోన్‌లు చేసి మా నాన్న తెలుసు అంటూ పిచ్చి పిచ్చి డ్రామాలు ఆడితే చంపేస్తాన‌ని రాజీవ్‌కు వార్నింగ్ ఇస్తాడు మ‌ను. నువ్వు న‌న్ను చంపేయ‌డం కాదు. నేనే నిన్ను చంపేయాల‌ని ఫోన్ చేసి ఇక్క‌డికి పిలిపించాన‌ని గ‌న్ తీసి మ‌నుకు గురిపెడ‌తాడు రాజీవ్‌.

మ‌హేంద్ర నిన్ను ద‌త్త‌త తీసుకుంటే నాకు వ‌సు ద‌క్క‌దు. అందుకే నీ క్యారెక్ట‌ర్‌కు ఇలా ముగింపు ప‌లుకుతున్నాన‌ని గ‌న్‌తో మ‌నును షూట్ చేయ‌బోతాడు. కానీ తెలివిగా రాజీవ్ చేతిలోని గ‌న్ కింద‌ప‌డేలా చేస్తాడు మ‌ను. వెంట‌నే త‌న గ‌న్ తీసి రాజీవ్ వైపు గురి పెడ‌తాడు.

గ‌తం చెప్ప‌న‌న్న అనుప‌మ‌…

మ‌ను గ‌తాన్ని గురించి అనుప‌మ‌ను అడుగుతుంది వ‌సుధార‌. కానీ అనుప‌మ మాత్రం స‌మాధానం చెప్ప‌న‌ని అంటుంది. ద‌త్త‌త జ‌రిగిన త‌ర్వాతే అన్ని విష‌యాలు చెబుతాన‌ని అంటుంది. మ‌నును ఆ కార్య‌క్ర‌మానికి ఎలాగైనా ర‌ప్పించాల‌ని అనుప‌మ కూడా ఫిక్స‌వుతుంది. మీ ఫోన్ నుంచి చేస్తే త‌ప్ప‌కుండా మ‌ను లిఫ్ట్ అనుప‌మ ఫోన్ తీసుకొని మ‌నుకు కాల్ చేస్తుంది వ‌సుధార‌.

ద‌త్త‌త కార్య‌క్ర‌మం పూర్త‌యిన త‌ర్వాత మీ తండ్రి ఎవ‌రు అనే నిజం చెబుతాన‌ని మ‌నుతో అంటుంది వ‌సుధార‌. కానీ త‌న‌ను ద‌త్త‌త కార్య‌క్ర‌మానికి ర‌ప్పించ‌డానికు వ‌సుధార అబ‌ద్ధం ఆడుతుంద‌ని మ‌ను అనుకుంటాడు.

చెప్పాల్సిన వాళ్లు చెప్ప‌న‌ప్పుడు నాకు ఆ విష‌యం ఎలా తెలుస్తుంది అంటూ అనుప‌మ‌పై కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తాడు. . ఈ ద‌త్త‌త నాకు, అనుప‌మ మేడ‌మ్‌కు ఇష్ట‌మో లేదో తెలుసుకోరా. అంద‌రి అంగీకారంతో ప‌నిలేదా అని వ‌సుధార‌ను ప్ర‌శ్నిస్తాడు మ‌ను.

నాకు ఇష్ట‌మే…

ఈ ద‌త్త‌త కార్య‌క్ర‌మం అనుప‌మ‌కు ఇష్ట‌మేనా…ఆమెకు ఇష్ట‌మైతే త‌ప్ప‌కుండా ద‌త్త‌త కార్య‌క్ర‌మానికి వ‌స్తాన‌ని వ‌సుధార‌తో అంటాడు మ‌ను. నీకు ఇష్ట‌మేన‌ని అనుప‌మ బ‌దులిస్తుంది. ఆమె చెప్పిన మాట‌తో మ‌ను షాక‌వుతాడు. ఇప్పుడు వ‌స్తాడో రాడో మ‌నును అడుగ‌మ‌ని వ‌సుధార‌తో అంటుంది అనుప‌మ‌. కానీ మను స‌మాధానం చెప్ప‌లేక ఫోన్ క‌ట్ చేస్తాడు.

ప్లేట్ ఫిరాయించిన శైలేంద్ర‌…

ద‌త్త‌త వేడుక కోసం ఫ‌ణీంద్ర రెడీ అవుతాడు. కానీ ఆ కార్య‌క్ర‌మానికి తాము రామ‌ని దేవ‌యాని అంటుంది. త‌న‌తో పాటు శైలేంద్ర కూడా రాడ‌ని చెబుతుంది. కానీ శైలేంద్ర మాత్రం ప్లేట్ ఫిరాయిస్తాడు. బాబాయ్ ద‌త్త‌త కార్య‌క్ర‌మం చేస్తున్న‌ప్పుడు మ‌నం వెళ్ల‌క‌పోతే ఎలా…మేము వ‌స్తున్నామ‌ని చెబుతాడు.

కొడుకు మాట‌ల‌తో దేవ‌యాని షాక‌వుతుంది. భ‌ర్త ద‌త్త‌త కార్య‌క్ర‌మానికి వెళ్దామ‌ని అన‌డం చూసి ధ‌ర‌ణి కూడా షాక‌వుతుంది. ద‌త్త‌త ఇష్టం లేద‌ని చెప్పిన భ‌ర్త ఇప్పుడు మాట మార్చ‌డం వెనుకు ఏదో కుట్ర ఉంద‌ని అనుమాన‌ప‌డుతుంది. అదే విష‌యం భ‌ర్త‌ను అడుగుతుంది. కానీ టాపిక్ డైవ‌ర్ట్ చేసి ఆమెను అక్క‌డి నుంచి పంపిస్తాడు శైలేంద్ర‌. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.