Karthika deepam 2 serial april 25th episode: దీప కోసం ఎవడో వచ్చాడంట కదా అంటూ పారిజాతం దీర్ఘాలు తీస్తుంది. తన మాటలకు సుమిత్ర, శివనారాయణ అడ్డుకట్ట వేస్తారు. అప్పుడే శౌర్యని ఎత్తుకుని దశరథ కిందకు దిగుతాడు. తాతయ్య నాకు చాలా చాక్లెట్స్ ఇచ్చారని సంతోషంగా చెప్తుంది.

ఇన్ని ఎందుకు ఇచ్చారని అంటుంది. నా కూతురికి పెళ్లై, పిల్లలు పుడితే మనవరాలితో ఆడుకుండామని అనుకున్నాను. కానీ ఆ దేవుడు నాకు కూతురిని, మనవరాలిని ఒకేసారి ఇచ్చాడు. తండ్రికి కూతురు మీద చనువు ఉంటుంది ఆ చనువుతోనే చెప్తున్నా నువ్వు ఎక్కడికి వెళ్లొద్దు ఇక్కడే ఉండాలి అంటాడు.

దీప బాధ్యత తీసుకున్న దశరథ

అయిన వాళ్ళకి బరువైయ్యాను కానీ వాళ్ళకు బాధ్యత అయ్యానని దీప మనసులో అనుకుంటుంది. సుమిత్ర నాకు మొత్తం చెప్పింది. చంటి దాన్ని ఇక్కడే స్కూల్ చేర్పిస్తానని చెప్తాడు. ఇక్కడ స్కూల్ అంటే లక్షల్లో ఖర్చు ఉంటుందని పారిజాతం అంటే శివనారాయణ కౌంటర్ వేస్తాడు.

ఇంక నువ్వు ఊరు వెళ్ళే ఆలోచన మానుకుని ప్రశాంతంగా ఉండు. ఇప్పుడు నీకు కూతురు మాత్రమే కాదు కుటుంబం కూడా ఉంది. నీ గురించి నిర్ణయం నేను తీసుకున్నాను నువ్వు ఉంటున్నావ్ అంతేనని దశరథ తేల్చి చెప్తాడు. దీప మౌనంగా ఉండేసరికి ఏమైనా ఇబ్బందా అని అడుగుతారు.

తను ఇక్కడ ఏ పని చేయకుండా ఉండలేనని దీప చెప్తుంది. నీ ఇష్టం కానీ చేసే ముందు తనకి ఇక మాట చెప్తే చాలని సుమిత్ర అంటుంది. ఇక్కడ నిన్ను ఎవరు ఏమి అనరు నిన్ను ఎవరైనా ఏమైనా అంటే తనతో చెప్పమని అంటుంది. దీంతో దీప ఉండేందుకు ఒప్పుకుంటుంది.

హైదరాబాద్ కి అనసూయ

దీప వెళ్తే ప్రశాంతంగా ఉందామని అనుకుంటే ఆపి నెత్తిన కూర్చోబెట్టారు. ఏం జరుగుతుందో ఏమోనని పారిజాతం కంగారుపడుతుంది. అనసూయకి డబ్బులు ఇచ్చి మల్లేష్ హైదరాబాద్ పంపిస్తాడు. తన ఇంటి జోలికి రావొద్దని చెప్తుంది. నీ ఇల్లు పడగొట్టి వైన్ షాప్ కట్టేస్తానని మల్లేష్ తెగ సంతోషపడతాడు.

జ్యోత్స్న బర్త్ డే పార్టీ జరుగుతుంది. కార్తీక్ దీప గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇద్దరి పుట్టినరోజులు ఒకే రోజు కానీ ఇక్కడ పార్టీ జరుగుతుంటే అక్కడ తనని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. దీపకు సాయం చేయడం గురించి ఆలోచిస్తాడు. జ్యోత్స్న డాన్స్ చేస్తూ ఉంటే గౌతమ్ కార్తీక్ ని చూస్తూ ఉంటాడు.

జ్యోత్స్న తన లవ్ ని రిజెక్ట్ చేసింది గుర్తు చేసుకుని రగిలిపోతూ ఉంటాడు. జ్యోత్స్న దగ్గరకు వచ్చి కార్తీక్ గురించి చెడుగా మాట్లాడేందుకు ట్రై చేస్తాడు. నువ్వు మీ బావ అంటే ఇష్టమని, తనకోసమే పుట్టానని చెప్పావు. కానీ మీ బావ పార్టీతో సంబంధం లేనట్టుగా కూర్చున్నాడని రెచ్చగొడతాడు.

మీ బావకు నువ్వంటే ఇష్టం లేదు

నువ్వు మీ బావతో డాన్స్ చేస్తే ప్రేమ ఉన్నట్టు అంటూ జ్యోత్స్నని ఉసిగొల్పుతాడు. జ్యోత్స్న వెంటనే కార్తీక్ దగ్గరకు వెళ్ళి తనతో డాన్స్ చేయమని అడుగుతుంది. గౌతమ్ మందు ఆఫర్ చేస్తాడు. ఇష్టం ఉండదని కార్తీక్ అంటే పార్టీ అంటే ఇష్టం లేదా లేదంటే జ్యోత్స్న అంటే ఇష్టం లేదా అంటాడు.

కార్తీక్ కి కోపం వస్తుంది. నీ అంత ఎఫెక్టివ్ గా మీ బావ నీ మీద ఉన్న లవ్ ని ఎక్స్ ప్రెస్ చేయడం లేదని చిచ్చుపెడతాడు. బావ నువ్వు చెప్పొచ్చు కదా జో నాకు కాబోయే భార్య, తనంటే నాకు చాలా ఇష్టమని చెప్పొచ్చు కదా అంటుంది. అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదని ఇది తన వ్యక్తిగతమని అంటాడు.

నువ్వంటే అభిమానమే

మరదలిగా నీ మీద నాకు ఎప్పుడు అభిమానం ఉంటుందని చెప్పేసి కార్తీక్ వెళ్ళిపోతాడు. నువ్వు ప్రేమ అంటున్నావ్ మీ బావ అభిమానం అంటున్నాడు అంటే ప్రేమ లేదన్నమాట అనిన గౌతమ్ జ్యోత్స్నని అవమానిస్తాడు. నీకు బావ అంటే ప్రాణం, కానీ మీ బావకు నువ్వు కేర్ లెస్ అని రెచ్చగొడతాడు.

జ్యోత్స్న కోపంగా అక్కడ ఉన్న మందు మొత్తం తాగేస్తుంది. దీప ఇంటి దగ్గర ఉన్న అనసూయ గురించి ఆలోచిస్తుంది. ఖాళీ చేతులతో వెళ్ళే కంటే ఇక్కడే ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించి వెళ్ళి అప్పులు తీర్చాలని అనుకుంటుంది. తనకి ఇక్కడ ఉండటం అంటే చాలా ఇష్టంగా ఉందని శౌర్య చెప్తుంది.

శౌర్య నరసింహ గురించి చెప్తుంది. మన ఇంటికి ఒక బూచోడు వచ్చాడు కదా అతన్ని నేను బట్టల షాపులో చూశాను. బూచోడు మళ్ళీ వస్తాడా? అంటే రాడని చెప్తుంది. మరి నాన్న ఎప్పుడు వస్తాడని శౌర్య బాధగా అడుగుతుంది. అందరూ కనపడుతున్నారు కానీ నాన్న కనిపించడం లేదు మనం ఇక్కడే ఉండిపోతే నాన్నని ఎలా కలుస్తామని అంటుంది.

నీకు నాన్న ఉన్నా లేనట్టే

నాన్నని వెతికేందుకు కార్తీక్ హెల్ప్ చేస్తానని చెప్పాడని అంటుంది. ఎక్కడ వెతకాల్సిన పని లేదని అంటుంది. ఇక నాన్న గురించి అడగొద్దు అని చెప్తుంది. నువ్వు ఎవరినైతే బూచోడు అంటున్నావో వాడే మీ నాన్న అని దీప బాధపడుతుంది. నాకు నాన్న లేడు నీకు ఉన్నా లేనట్టేనని దీప అనుకుంటుంది.

కార్తీక్ ఒక్కడే ఇంటికి రావడంతో తనని ఎలా ఒంటరిగా వదిలేసి వచ్చావని తల్లిదండ్రులు నిలదీస్తారు. ఫోన్ వచ్చిందని అందుకే వచ్చానని చెప్తాడు. ఫోన్ కాల్ కు ఉండే ఇంపార్టెన్స్ కూడా నా కోడలికి లేదా అని కాంచన అంటుంది. జ్యోత్స్నకి చెప్పే వచ్చాను ఏం ఫీల్ అవదులే అనేసి కోపంగా వెళ్ళిపోతాడు. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.