Kajal Agarwal vs Vishwak Sen: బ్యూటిఫుల్ చందమామ క్వీన్ ఆఫ్ మాసెస్‌గా మారిపోయింది. ఇప్పటివరకు హీరోయిన్‌గా గ్లామర్ పాత్రలు చేసుకంటూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య లేడి ఒరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. పెళ్లి, బాబు తర్వాత సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఇదివరకు తమిళంలో కొన్ని సినిమాలు రిలీజ్ కాగా తెలుగులో మాత్రం భగవంత్ కేసరితో అలరించింది.

కమల్ హాసన్ ఇండియన్ 2, మంచు విష్ణు కన్నప్ప సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది కాజల్ అగర్వాల్. ఇక కాజల్ మెయిన్ లీడ్ రోల్‌లో ఫీమెల్ సెంట్రిక్ మూవీగా వస్తోంది సత్యభామ. ఇటీవల ఈ సినిమా విడుదల తేది ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. మే 17న ఈ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.

అయితే, ఆ పోస్టర్‌లో కాజల్ అగర్వాల్‌ను క్వీన్ ఆఫ్ మాసెస్‌గా పేర్కొన్నారు మేకర్స్. దాంతో ఆ పోస్టర్ వైరల్ కావడంతో నెటిజన్స్‌తోపాటు కాజల్ ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోయారు. క్వీన్ ఆఫ్ మాసెస్ ఆ.. ఇదెప్పుడు పెట్టారు, మాస్‌కు క్వీన్ ఎలాగైంది, అలా ఎలాగమ్మా అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు నెటిజన్స్.

ఇక ఈ మాస్ అనే ట్యాగ్ లైన్ ఎక్కువగా హీరోలకు ఉంటుందన్న విషయం తెలిసిందే. బాలకృష్ణను గాడ్ ఆఫ్ మాసెస్ అని, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను మ్యాన్ ఆఫ్ మాసెస్, మాస్ మహారాజా రవితేజ, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. అయితే, హీరోయిన్లలలో ఎవరికీ మాస్ ట్యాగ్ లైన్ లేదు. అలాంటిది కాజల్ అగర్వాల్‌కు తొలిసారిగా ఈ ట్యాగ్ రావడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే మాస్ అనే ట్యాగ్ తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ తొలి హీరోయిన్‌గా నిలిచింది. ఇకపోతే మే 17న కాజల్ అగర్వాల్ సత్యభామ రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అదే తేదిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ కూడా విడుదల కానుంది. దీంతో కాజల్ అగర్వాల్, విశ్వక్ సేన్ మధ్య బాక్సాఫీస్ ఫైట్ జరగడం కాయం అని తెలుస్తోంది.

ఇక పోతే కాజల్ అగర్వాల్ తొలిసారిగా మాస్ రోల్ చేస్తోంది. సత్యభామ సినిమాలో కాజల్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లో నటిస్తోంది. అమరేందర్ అనే కీలక పాత్రను నవీన్ చంద్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మిస్తున్నారు.

మేజర్ చిత్ర దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకులుగా వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే అందించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు డైరెక్టర్ సుమన్ చిక్కాల దర్శకత్వం వహించారు. ఇక సత్యభామ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ కోసం డిజైన్ చేసిన వీడియో క్రియేటివ్‌గా ఉంది.

క్రైమ్ సీన్ నుంచి రికవరీ చేసిన గన్ విడి పార్ట్స్ లోడ్ చేసి కాజల్ షూట్ చేయగా.. అది క్యాలెండర్‌లో మే 17 డేట్‌ను టార్గెట్ చేస్తూ దూసుకెళ్తుంది. మే 17న సత్యభామ సినిమా రిలీజ్‌ను ఇలా ఇన్నోవేటివ్‌గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన కంటెంట్‌కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే బజ్ క్రియేట్ కాగా సత్యభామ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.