Beauty Movie: 2023 రిలీజైన బేబీ’ క‌మ‌ర్షియ‌ల్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై వంద కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. బేబీ త‌ర‌హాలో మ‌రో యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నాడు డైరెక్టర్ మారుతి. అయితే డైరెక్ట‌ర్‌గా కాదు ప్ర‌జెంట‌ర్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించ‌బోతున్నాడు. ఈ ల‌వ్‌స్టోరీకి బ్యూటీ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. రావు రమేష్ ప్రధాన పాత్రలో న‌టిస్తోన్న ఈ సినిమాలో అంకిత్ కొయ్య, విశాఖ ధిమన్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. బాల సుబ్రహ్మణ్యం ఆర్‌వీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

లండ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌…

ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో బ్యూటీ సినిమా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల్లో ద‌ర్శ‌కుడు మారుతితో పాటు ఉప్పెన‌ డైరెక్ట‌ర్ బుచ్చిబాబు పాల్గొన్నాడు.లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా బ్యూటీ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు ద‌ర్శ‌కుడు ప్ర‌క‌టించాడు.

బ్యూటీ మూవీ షూటింగ్ మే నెల 2వ తేదీ నుంచి నుండి హైదరాబాద్ పరిసర పాంతాల్లో జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించాడు బ్యూటీ మూవీకి బేబీ ఫేమ్‌ విజయ్ బుల్గానిన్ సంగీతం అందించ‌బోతున్నాడు. ఎ.విజయ్ పాల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

మారుతి స‌ల‌హాలు, సూచ‌న‌లు…

బేబీ త‌ర‌హాలోనే బ్యూటీ కూడా తెలుగు ప్రేక్ష‌కుల్ని అల‌రించే బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీ అవుతుంద‌ని మేక‌ర్స్ వెల్ల‌డించాడు. బేబీ నిర్మాణంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన డైరెక్ట‌ర్ మారుతి బ్యూటీ రూప‌క‌ల్ప‌న‌లో ముఖ్య పాత్ర పోషించ‌నున్నాడు. మారుతి స‌ల‌హాలు, సూచ‌న‌ల‌తో ఈ మూవీ రూపొందుతోంది.

ప్ర‌భాస్‌తో రాజాసాబ్‌…

ప్ర‌స్తుతం ప్ర‌భాస్‌తో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు మారుతి. సూప‌ర్ నాచుర‌ల్ క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ కొన‌సాగుతోంది. మారుతి కెరీర్‌లో స్టార్ హీరోతో చేయ‌నున్న ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. రాజా సాబ్ సినిమాలో సంజ‌య్ ద‌త్ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు.నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్లుగా న‌టిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

రాజా సాబ్ ఫ‌స్ట్ సింగిల్‌ను త్వ‌ర‌లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. అయినా ఫ‌స్ట్ లుక్ మిన‌హా ఎలాంటి అప్‌డేట్స్‌ను మేక‌ర్స్ రివీల్ చేయ‌లేదు. క‌ల్కి రిలీజ్ త‌ర్వాతే రాజా సాబ్ ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్ట‌బోతున్నారు.

మారుతిన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం…

ప్ర‌స్తుతం రావుర‌మేష్, అంకిత్ కొయ్య క‌లిసి మారుతిన‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం సినిమా చేస్తోన్నారు. మారుతి న‌గ‌ర్ సుబ్ర‌మ‌ణ్యం సినిమాతో హీరోగా రావుర‌మేష్ ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ మూవీలో అత‌డి కొడుకుగా అంకిత్ కొయ్య క‌నిపించ‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ మూవీ థియేట‌ర్ల‌లో రిలీజ్ కాబోతోంది.