Best Sci-Fi movies on OTTs: సైన్స్ ఫిక్షన్ (Sci-Fi) జానర్ సినిమాకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ఈ సినిమాలను మనల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇలాంటి సినిమాలు తీయడంలో హాలీవుడ్ వాళ్లది అందెవేసిన చేయి. అయితే తెలుగులోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ఈ జానర్ నుంచి వచ్చాయి. ఆ సినిమాలు ఏంటి? వాటిని ఏ ఓటీటీల్లో చూడాలో ఒకసారి చూద్దాం.

ఓటీటీల్లోని బెస్ట్ సైన్స్ ఫిక్షన్ సినిమాలు

నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లాంటి ఓటీటీల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ సై-ఫి మూవీస్ ఉన్నాయి. ఈ జానర్ ను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాలను చూడొచ్చు.

ఒకే ఒక జీవితం – సోనీలివ్

టైమ్ ట్రావెల్ కథతో తెలుగులో రూపొందిన మూవీ ఒకే ఒక జీవితం. శర్వానంద్, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, అమల అక్కినేని నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రస్తుతం సోనీలివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.

అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ – ప్రైమ్ వీడియో

ఇది కూడా తెలుగులో వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీ. వరుణ్ తేజ్, అదితి రావ్, లావణ్య త్రిపాఠీ నటించిన ఈ సినిమాను సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. ఇదొక స్పేస్ అడ్వెంచర్ మూవీ. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ఉంది.

యశోద – ప్రైమ్ వీడియో

సరోగసీ చుట్టూ తిరిగే సైన్స్ ఫిక్షన్ మూవీ యశోద. సమంత లీడ్ రోల్లో నటించింది. థియేటర్లలో ఈ మూవీకి అంతగా రెస్పాన్స్ లేకపోయినా.. ఓటీటీలో మాత్రం ఫర్వాలేదనిపించింది. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

2.0 – జియో సినిమా

రజనీకాంత్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ 2.0. ఇందులో అక్షయ్ కుమార్ కూడా నటించాడు. మొబైల్ టవర్ల వల్ల పక్షులు మృత్యువాత పడటం, వాటిని కాపాడటానికి ఓ పక్షి ప్రేమికుడు చేసే పోరాటం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. జియో సినిమాలో ఈ మూవీ చూడొచ్చు.

బెస్ట్ హాలీవుడ్ సై-ఫి మూవీస్

ఇంటర్‌స్టెల్లార్ – ప్రైమ్ వీడియో

క్రిస్టఫర్ నొలాన్ డైరెక్ట్ చేసిన ఇంటర్‌స్టెల్లార్ మూవీ మనల్ని మొత్తంగా ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మన గెలాక్సీ దాటిపోయి తారాలోకంలోకి చేసే ప్రయాణమే ఈ ఇంటర్‌స్టెల్లార్. ఈ సినిమాను ప్రైమ్ వీడియోలో చూసే వీలుంది.

ది మ్యాట్రిక్స్ – నెట్‌ఫ్లిక్స్

జురాసిక్ పార్క్ – నెట్‌ఫ్లిక్స్

హర్ – ప్రైమ్ వీడియో

అవతార్ – డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

బ్లేడ్ రన్నర్ 2049 – ప్రైమ్ వీడియో

ది మార్షన్ – హాట్‌స్టార్

ఇన్సెప్షన్ – ప్రైమ్ వీడియో

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్ – నెట్‌ఫ్లిక్స్

అరైవల్ – ప్రైమ్ వీడియో

గ్రావిటీ – ప్రైమ్ వీడియో

ఎ క్వైట్ ప్లేస్ – ప్రైమ్ వీడియో

ది టర్మినేటర్ – ప్రైమ్ వీడియో