IPL 2024: ఐపీఎల్ పుణ్య‌మా అని దేశ‌, విదేశీ క్రికెట‌ర్లు కోట్ల‌లో సంపాదిస్తున్నారు. నేష‌న‌ల్ కాంట్రాక్ట్‌ల‌కు మించి డ‌బ్బుల‌ను ఆర్జిస్తున్నారు. అప్ఘ‌నిస్తాన్‌, వెస్టిండీస్ దేశాల‌కు చెందిన క్రికెట‌ర్లు అయితే త‌మ నేష‌న‌ల్ టీమ్స్‌కు ఆడేకంటే ఐపీఎల్ ఆడ‌టానికే ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు.

మిచెల్ స్టార్క్‌ 24 కోట్లు…

ఐపీఎల్ 2024 వేలంలో ఆస్ట్రేలియా క్రికెట‌ర్ల‌పై కాసుల వ‌ర్షం కురిసింది. మిచెల్ స్టార్క్‌ను 24.75 కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కొనుగోలు చేయ‌గా…పాట్ క‌మిన్స్‌ను 20.50 కోట్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ సొంతం చేసుకున్న‌ది. డారీమిచెల్‌ను 14 కోట్ల‌కు చెన్నై కొన్న‌ది. విదేశీ స్టార్స్‌తో పాటు కొంద‌రు ఇండియ‌న్ క్రికెట‌ర్స్ సైతం ఐపీఎల్ వేలంలో కోట్ల‌లో ధ‌ర ప‌లికారు.

ఐపీఎల్‌లో కోట్లు పెట్టి కొన్న కొంద‌రు క్రికెట‌ర్ల‌ను ఒక్క మ్యాచ్ ఆడించ‌కుండా ఫ్రాంచైజ్‌లు ప‌క్క‌న‌పెడుతోన్నారు. ఆ క్రికెట‌ర్లు ఎవ‌రంటే…

జోష్ లిటిల్‌…

ఐర్లాండ్ పేస‌ర్‌ జోష్ లిటిల్‌ను గుజ‌రాత్ టైటాన్స్ ఐపీఎల్ వేలంలో 4.4 కోట్ల‌కు కొనుగోలు చేసింది. గుజ‌రాత్ టైటాన్స్ ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఎనిమిది మ్యాచ్‌లు ఆడ‌గా ఒక్క‌సారి కూడా జోష్ లిటిల్‌కు ఆడే ఛాన్స్ రాలేదు. తుది జ‌ట్టులో ఛాన్స్ కోసం ఆ పేస‌ర్‌ ఎదురుచూస్తోన్నాడు. టీ20ల్లో జోష్ లిటిల్‌కు మంచి రికార్డ్ ఉంది.

క్రిస్ వోక్స్‌…

ఇంగ్లాండ్ ఆల్‌రౌండ‌ర్ క్రిస్ వోక్స్‌ను పంజాబ్ కింగ్స్ 4.2 కోట్ల‌కు పంజాబ్ కింగ్స్ ద‌క్కించుకున్న‌ది. బ్యాటింగ్ ప‌రంగా లోయ‌ర్ ఆర్డ‌ర్‌లో ఉప‌యోగ‌ప‌డ్ క్రిస్ వోక్స్‌ను పంజాడ్ ఆడించ‌కుండా ప‌క్క‌న‌పెడుతోంది. మిగిలిన మ్యాచ్‌ల‌లోనైనా అత‌డిని ఆడిస్తుందో లేదో చూడాల్సిందే.

గ్లెన్ ఫిలిప్స్‌…

న్యూజిలాండ్ క్రికెట‌ర్ గ్లెన్ ఫిలిప్స్‌ను కోటి యాభై ల‌క్ష‌ల‌కు స‌న్‌రైజ‌ర్స్ సొంతం చేసుకున్న‌ది. ఈ సీజ‌న్‌లో జ‌ట్టుతో పాటే ఉన్నా అత‌డికి మాత్రం ఆడే ఛాన్స్ రావ‌డం లేదు. స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టు కూర్పు చూస్తుంటే ఫిలిప్స్ 2024 ఐపీఎల్‌లో బ‌రిలో దిగ‌డం క‌ష్టంగానే క‌నిపిస్తోంది.

వెస్టిండీస్ హిట్ట‌ర్ షెర్ఫాన్ రూథ‌ర్‌ఫోర్డ్‌ను కోల్‌క‌తా కోటిన్న‌ర‌కు కొన్న‌ది. ఆండ్రీ ర‌సెల్ మాదిరిగా బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మెరుపులు మెరిపించ‌గ‌ల ఈ క్రికెట‌ర్ ఈ సీజ‌న్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడ‌లేదు.

జ‌యంత్ యాద‌వ్‌…

టీమిండియా స్పిన్న‌ర్‌ జ‌యంత్ యాద‌వ్‌ను 1.70 కోట్ల‌కు గుజ‌రాత్ టైటాన్స్ ఐపీఎల్ వేలంలో కొనుగోలు చేసింది.డొమెస్టిక్ క్రికెట్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ క్రికెట‌ర్ ఐపీఎల్ 2024లో మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు బ‌రిలో దిగ‌లేదు. వీరితో పాటు మ‌రికొంద‌రు క్రికెట‌ర్లు కోట్లు ధ‌ర ప‌లికిన ఒక్క మ్యాచ్ ఆడ‌కుండా బెంచ్‌ల‌కు ప‌రిమిత‌మ‌య్యారు. ఇప్ప‌టివ‌ర‌కు టీమిండియా త‌ర‌ఫున ఆరు టెస్ట్‌లు, రెండు వ‌న్డేలు ఆడాడు జ‌యంత్ యాద‌వ్‌.