వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.25 లక్షల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే పాయం

0

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవాహిణి ప్రతినిధి మణుగూరు:- మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పాత మణుగూరులోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించబోయే కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మరియు గ్రామ ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే గ్రామంలో జరిగే సామాజిక, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు...

అశ్వాపురం నూతన సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ సభ్యులు

0

అశ్వాపురం నూతన సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవాహిణి ప్రతినిధి అశ్వాపురం:- అశ్వాపురం పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఎల్లయ్యను అశ్వాపురం సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ ఎల్లయ్యకు పుష్పగుచ్ఛం అందించి, ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులతో సీఐ ఎల్లయ్య స్నేహపూర్వకంగా ముచ్చటిస్తూ, పోలీస్ శాఖ, మీడియా పరస్పర సహకారంతో...

లంచం ఇస్తేనే పని చేస్తారు..!

0

యాలాల తహసీల్దార్ ఆఫీసులో 'లంచాల' పర్వం! డిప్యూటీ ఎంఆర్వో రూ.50 వేలు.. బంటు రూ.20 వేలు అడుగుతున్నారు ఆరు నెలలైనా కాని పట్టా రిజిస్ట్రేషన్.. కలెక్టర్‌కు మాజీ సర్పంచ్ ఫిర్యాదు జనవాహిని ప్రతినిధి తాండూరు : యాలాల మండల రెవెన్యూ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందని బషీర్మీయా తండా మాజీ సర్పంచ్ మిత్రు నాయక్ అన్నారు. రెవెన్యూ అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పట్టా భూమి రిజిస్ట్రేషన్ కోసం గత రెండు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు...

అక్రమ కేసులకు భయపడేది లేదు..!

0

ధరల పెంపుపై ధర్నా చేస్తే కక్షసాధింపు చర్యలు  ఆరేళ్లుగా వేధిస్తున్నా వెనకడుగు వేసేది లేదు  కోర్టుకు హాజరైన కాంగ్రెస్ నాయకులు  జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రజల పక్షాన నిలబడి పోరాడే వారిని అక్రమ కేసులతో భయపెట్టలేరని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. గత 2020లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ధర్నాను మనసులో ఉంచుకుని, అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం తమపై కక్షపూరితంగా అక్రమ కేసులు బనాయించిందని వారు మండిపడ్డారు. గత ఆరు సంవత్సరాలుగా...

పనికి సమాన వేతనం కావాలి

0

సేవ్ సింగరేణి దీక్షలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే కూనంనేనికి వినతిపత్రం సమాన పనికి సమాన వేతనం అమలు 22 జీవో తక్షణ అమలు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యత సింగరేణి యాజమాన్యం తక్షణ స్పందన కార్మికుల న్యాయమైన హక్కులు సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. సేవ్ సింగరేణి దీక్షలో కార్మికుల వినతిపత్రం కూనంనేనికి కాంట్రాక్ట్ కార్మికుల విజ్ఞప్తి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ 22 జీవో అమలుకు కార్మికుల ఆందోళన మణుగూరులో కొనసాగుతున్న సేవ్ సింగరేణి దీక్షలు. మణుగూరు, జూన్ 22: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవహిణి ప్రతినిధి మణుగూరు:-...

అంగన్‌వాడీ భోజనాన్ని రుచి చూసిన కౌన్సిలర్..!

0

అంగన్‌వాడీ కేంద్రాల్లో కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప ఆకస్మిక తనిఖీ  భోజనం చేసి ఆహార నాణ్యతను పరిశీలించిన కౌన్సిలర్ చిన్నారులకు పుస్తకాలు, యూనిఫామ్‌ల పంపిణీ జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు కౌన్సిలర్ దివిటి ఎల్లప్ప సోమవారం తమ వార్డు పరిధిలోని రెండు అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల్లో చిన్నారులకు అందుతున్న సౌకర్యాలు, విద్యాబోధన, పౌష్టికాహార పంపిణీ తీరును ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ ఎల్లప్ప మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం...

పాఠశాలలు బంద్...!

0

ప్రభుత్వ పాఠశాలల మూసివేత కుట్రను తిప్పికొట్టాలి కార్పొరేట్ విద్యా మాఫియాకు ప్రభుత్వం రెడ్ కార్పెట్   బంద్   ను విజయవంతం చేయాలని తాండూరు నగర అధ్యక్షులు నర్సిములు పిలుపు జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్రంలోని పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తూ, ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి కొమ్ముకాస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జూన్ 23న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన పాఠశాలల బంద్‌ను విజయవంతం చేయాలని అఖిల భారత విద్యార్థి పరిషత్ తాండూరు నగర అధ్యక్షులు...

ఓట్లు బీసీలవి.. అధికార పీఠాలు మీవా..?

0

బీసీ కులవృత్తులపై ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలి ​ప్రత్యేక కార్యాచరణ ప్రకటించకుంటే లక్షలాది కుటుంబాల ఉపాధి గాల్లోకే.. పావుల వడ్డీ రుణాలు, ఆధునిక పనిముట్లు ఇవ్వాలి జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి  జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్రంలో బీసీ కులాల సాంప్రదాయ వృత్తులు రోజురోజుకు కనుమరుగవుతుండడం అత్యంత ఆందోళనకరమని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు. వృత్తులను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన...

ఇళ్ళు అడిగితే బూతులు తిట్టాడు...!

0

గాజీపూర్ సర్పంచ్ భర్త లాల్ రెడ్డిపై పెద్దేముల్ పీఎస్‌లో ఫిర్యాదు  మహిళలని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషణలు ఊర్లో ఎలా బ్రతుకుతారో చూస్తా’ అంటూ ప్రాణహాని బెదిరింపులు రక్షణ కల్పించాలంటూ బాధితురాలు సత్యమ్మ ఆవేదన జనవాహిని ప్రతినిధి తాండూరు : ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు కేటాయించాలని కోరినందుకు ఓ పేద మహిళపై గ్రామ సర్పంచ్ భర్త అధికార అహంకారంతో రెచ్చిపోయిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో సంచలనం రేకెత్తించింది. బాధితురాలిని మరియు ఆమె కోడలిని మహిళలని కూడా చూడకుండా...

రాహుల్ గాంధీ బర్త్‌డే వేడుకలు...!

0

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగు ఆధ్వర్యంలో నిర్వహణ జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాతుల నాగు నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు తాండూరు నియోజకవర్గ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి...