HomeNewsవేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.25 లక్షల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే...

వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.25 లక్షల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే పాయం

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

జనవాహిణి ప్రతినిధి

మణుగూరు:- మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని పాత మణుగూరులోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో రూ.25 లక్షల వ్యయంతో నిర్మించబోయే కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈరోజు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధితో పాటు భక్తులకు మరియు గ్రామ ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే గ్రామంలో జరిగే సామాజిక, ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, జిల్లా ముఖ్య నాయకులు, మండల ముఖ్య నాయకులు, 14 టైర్ యూనియన్ నాయకులు, గుమస్తాల సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments