HomeNewsసార్’ కన్వీనర్‌గా కర్ణం పురుషోత్తం రావు..!

సార్’ కన్వీనర్‌గా కర్ణం పురుషోత్తం రావు..!

spot_img
JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
  • కాంగ్రెస్ పార్టీ తాండూర్ నియోజకవర్గ ‘సార్’ కన్వీనర్‌గా కర్ణం పురుషోత్తం రావు
  •  నియమించిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
  •  269 పోలింగ్ బూత్‌లలో పకడ్బందీగా ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ

జనవాహిని ప్రతినిధి తాండూరు : భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియను నియోజకవర్గంలో పకడ్బందీగా పర్యవేక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తాండూర్ నియోజకవర్గ ‘సార్’ కన్వీనర్‌గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ న్యాయవాది కర్ణం పురుషోత్తం రావును నియమిస్తున్నట్లు తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణలో భాగంగా ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ముందస్తు ప్రక్రియ ‘వోటర్ మ్యాపింగ్’ అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. గతంలో 2002-2004 మధ్య కాలంలో జరిగిన చివరి సార్ రికార్డులను ప్రస్తుత ఓటర్ల జాబితాతో పోల్చి పరిశీలిస్తూ, ప్రతి ఓటరును వారి పాత రికార్డులు లేదా కుటుంబ మూలాలతో అనుసంధానించడమే ఈ మ్యాపింగ్ యొక్క ప్రధాన ఉద్దేశమని వివరించారు.ఈ ముమ్మర సవరణ ప్రక్రియను పార్టీ పరంగా విజయవంతం చేసేందుకు తాండూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల పరిధిలో గల 269 పోలింగ్ బూత్‌లకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కొత్తగా నియమితులైన నియోజకవర్గ కన్వీనర్ కర్ణం పురుషోత్తం రావు క్షేత్రస్థాయిలో ఉన్న బిఎల్ఏ లకు నిరంతరం అందుబాటులో ఉంటూ, వారికి అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తారని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సార్ ప్రక్రియ ఎలాంటి లోపాలు లేకుండా, పకడ్బందీగా జరిగేలా పార్టీ శ్రేణులు చురుగ్గా పాల్గొనాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.

JANAVAHINITV EPAPER CLIP STUDIO • READY
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments