HomeNewsఓట్లు బీసీలవి.. అధికార పీఠాలు మీవా..?

ఓట్లు బీసీలవి.. అధికార పీఠాలు మీవా..?

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • బీసీ కులవృత్తులపై ప్రభుత్వ నిర్లక్ష్యం వీడాలి
  • ​ప్రత్యేక కార్యాచరణ ప్రకటించకుంటే లక్షలాది కుటుంబాల ఉపాధి గాల్లోకే..
  • పావుల వడ్డీ రుణాలు, ఆధునిక పనిముట్లు ఇవ్వాలి
  • జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి 

జనవాహిని ప్రతినిధి తాండూరు : రాష్ట్రంలో బీసీ కులాల సాంప్రదాయ వృత్తులు రోజురోజుకు కనుమరుగవుతుండడం అత్యంత ఆందోళనకరమని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి అన్నారు. వృత్తులను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో బీసీల అభ్యున్నతి, వృత్తుల అభివృద్ధి, స్వయం ఉపాధికి పెద్దపీట వేస్తామని హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను బుట్టదాఖలు చేసిందని మండిపడ్డారు.మంగలి, చాకలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, వడ్డెర, స్వర్ణకారులు, దర్జీలు, ఉప్పర, బోయ, గౌడలు, నేతకారులు, కుర్మలు, మత్స్యకారులు తదితర బీసీ వృత్తిదారులు ఆధునిక యుగంలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని రాజ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి వృత్తులను ఆధునికీకరించే దిశగా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన విధానాన్ని ప్రకటించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. బీసీల అభివృద్ధి అంటే కేవలం సంక్షేమ పథకాల ప్రకటనలు చేయడం కాదని, సాంప్రదాయ వృత్తులకు ఆధునిక సాంకేతికతను అందించినప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న బీసీ వృత్తిదారుల జీవనోపాధిని రక్షించే విషయంలో ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని ఆయన దుయ్యబట్టారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చి, వారి జీవనోపాధిని కాపాడే నిర్ణయాలను ఆలస్యం చేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి జిల్లాలో బీసీ వృత్తిదారుల అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయాలని, యువతకు ఉపాధి కల్పించే సమగ్ర కార్యాచరణ రూపొందించాలని ఈ సందర్భంగా రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments