HomeNewsపనికి సమాన వేతనం కావాలి

పనికి సమాన వేతనం కావాలి

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY

సేవ్ సింగరేణి దీక్షలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఎమ్మెల్యే కూనంనేనికి వినతిపత్రం

సమాన పనికి సమాన వేతనం అమలు

22 జీవో తక్షణ అమలు కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల పెంపు కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యత
సింగరేణి యాజమాన్యం తక్షణ స్పందన

కార్మికుల న్యాయమైన హక్కులు సాధించే వరకు ఉద్యమం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

సేవ్ సింగరేణి దీక్షలో కార్మికుల వినతిపత్రం

కూనంనేనికి కాంట్రాక్ట్ కార్మికుల విజ్ఞప్తి

సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్
22 జీవో అమలుకు కార్మికుల ఆందోళన
మణుగూరులో కొనసాగుతున్న సేవ్ సింగరేణి దీక్షలు.

మణుగూరు, జూన్ 22:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

జనవహిణి ప్రతినిధి

మణుగూరు:- మణుగూరు అంబేద్కర్ సెంటర్‌లో “సేవ్ సింగరేణి” ఉద్యమంలో భాగంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరుకాగా, ఏఐటీయూసీ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు తమ సమస్యలను వివరిస్తూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం “సమాన పనికి సమాన వేతనం” అమలు చేయాలని, 22 జీవోను వెంటనే అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు పెంచి సంక్షేమ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కార్మికుల సమస్యలను పరిశీలించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు కృషి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ కార్మికులు ఏ. ప్రవీణ్ కుమార్, ఏఐటియుసి. కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆర్గనైజర్ జి. రాజశేఖర్, కె. శేఖర్‌బాబు, పొదిల వీరబాబు, యు. రమేష్, సమ్మయ్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులు హాజరై తమ ఐక్యతను చాటిచెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments