HomeNewsఅశ్వాపురం నూతన సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ సభ్యులు

అశ్వాపురం నూతన సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ సభ్యులు

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY

అశ్వాపురం నూతన సీఐని మర్యాదపూర్వకంగా కలిసిన సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ సభ్యులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనవాహిణి ప్రతినిధి అశ్వాపురం:- అశ్వాపురం పోలీస్ స్టేషన్ నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఎల్లయ్యను అశ్వాపురం సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ సభ్యులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ ఎల్లయ్యకు పుష్పగుచ్ఛం అందించి, ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ సభ్యులతో సీఐ ఎల్లయ్య స్నేహపూర్వకంగా ముచ్చటిస్తూ, పోలీస్ శాఖ, మీడియా పరస్పర సహకారంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రెడ్డి మహేష్‌తో పాటు పగడాల రామ్ రెడ్డి, గద్దల ఏడుకొండలు, గరికపాటి అంజన్ రావు, అన్నెబోయిన సతీష్, రావులపల్లి నరసింహారావు, మురళి, అలవాల నాగరాజు, అండం గంగరాజు గౌడ్, వెంకట్ రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments