HomeNewsరాహుల్ గాంధీ బర్త్‌డే వేడుకలు...!

రాహుల్ గాంధీ బర్త్‌డే వేడుకలు…!

spot_img
జానవాహిణి డిజిటల్ దినపత్రిక EPAPER CLIP STUDIO • READY
  • ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
  • ఘనంగా కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
  • పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బాతుల నాగు ఆధ్వర్యంలో నిర్వహణ

జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బాతుల నాగు నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలకు తాండూరు నియోజకవర్గ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి, రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశ సమగ్రత కోసం, ప్రజాస్వామ్య విలువల రక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటం అమోఘమన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తే ఆయన ఆశయ సాధన కోసం పార్టీ శ్రేణులన్నీ ఏకతాటిపై నడవాలని పిలుపునిచ్చారు. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కోరారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలను క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సమక్షంలో పండుగలా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని పట్టణ అధ్యక్షులు బాతుల నాగు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ధారసింగ్, ఏఎంసి చైర్మన్ పట్లోళ్ల నర్సింలు, కారణం పురుషోత్తం, మున్సిపల్ ఛైర్పర్సన్ నీరజ బాల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్ రెడ్డి, నాయకులు, ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments