AP Polycet 2024: ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్-2024 నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఏపీ నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 442 కేంద్రాలలో ఏప్రిల్ 27వ తేదీన Entrance Exam ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.

వేసవి ఉష్ణోగ్రతల Summer నేపథ్యంలో పాలిసెట్ పరీక్షా కేంద్రాల్లో Exam centresమంచినీరు, వైద్య సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా పరీక్షా కేంద్రాలకు ముందస్తుగా చేరుకోవాలని సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి సూచించారు.

విద్యార్ధులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా “పాలిసెట్– 2024“ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని నైపుణ్యాభివృద్ది శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ తెలిపారు.

ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ లలో ప్రవేశం కోసం నిర్వహించే “పాలిసెట్– 2024“ నిర్వహణకు సంబంధించి గురువారం సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ కార్యాలయంలో ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష జరగనుంది. సు

వడగాలుల తీవ్రత నేపధ్యంలో ప్రతి కేంద్రం వద్ద మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి అత్యవసర మందులు సిద్దంగా ఉంచాలన్నారు. విద్యుత్త్ సరఫరాలో అంతరాయం లేకుండా అయా శాఖల అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చి సమన్వయం చేసుకోవాలన్నారు.

పదవ తరగతి తర్వాత ఉజ్వల భవిష్యత్తుతో కూడిన ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఉత్తమమైన మార్గం “పాలిటెక్నిక్ విద్య” మాత్రమేనని సురేష్ కుమార్ పేర్కొన్నారు. పాలిటెక్నిక్ పూర్తి అయిన వెంటనే సత్వర ఉపాధి కల్పించేందుకు వివిధ పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నామని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ లేబరేటరీలను ఆధునీకరించి, వసతి కల్పనను సైతం మెరుగుపరచామని, ఎన్ బిఎ గుర్తింపు పొందిన 36 ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో విద్యార్ధులకు మరింత మెరుగైన విద్యనందించనున్నామని సురేష్ కుమార్ తెలిపారు.

1.59లక్షల దరఖాస్తులు..

ఏప్రిల్ 27వ తేదీన జరిగే ప్రవేవ పరీక్షకు 442 కేంద్రాలలో 1,59,783 మంది ధరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బాలికలు 64,538, బాలురు 95,245 మంది ఉన్నారు. రాష్ట్ర స్ధాయిలో పరీక్ష నిర్వహణకు 65 సమన్వయ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఉదయం 8 గంటల తరువాత భద్రతా కేంద్రాల నుండి పరీక్షా పత్రాలు పరీక్షా కేంద్రాలకు చేరుకుంటాయని, పదకొండు గంటలకు ప్రవేశ పరీక్ష ప్రారంభం అవుతుందని వివరించారు.

ప్రవేశపరీక్షకు హాజరైన వారిలో ఒంటి గంటలోపు విద్యార్ధులను బయటకు అనుమింతబోమని నాగరాణి స్పష్టం చేసారు. 26 మంది జిల్లా స్దాయి పరీశీలకులు, 62 మంది సమన్వయ కేంద్రాల పరిశీలకులు, 442 మందిని పరీక్షా కేంద్రాల పరీశీలకులుగా నియమించామన్నారు. ప్రతి 24 మంది విద్యార్ధులకు ఒక ఇన్విజిలేటర్ ఉంటారని, పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు కోరామని తెలిపారు.

పరీక్షా కేంద్రాల వద్దే ఫీజు వసూలు…

పాలిసెట్‌కు దరఖాస్తు చేసిన వారిలో కొందరు విద్యార్ధులు ఆన్ లైన్ ఫీజు చెల్లింపులో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, చెల్లుబాటు అయ్యే ధరఖాస్తును వారు పరీక్షా కేంద్రాలకు తీసుకువస్తే అక్కడ నేరుగా ఫీజు కట్టించుకుని హల్ టిక్కెట్టు ఇస్తారని కమిషనర్‌ తెలిపారు.

అధికారులు, సిబ్బంది, విద్యార్ధులు పరీక్షా కేంద్రాలకు ముందస్తుగా చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని, సార్వత్రిక ఎన్నికల హడావుడి కారణంగా ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా జాగ్రత్త పడాలని కమిషనర్‌ హెచ్చరించారు.

పాలీసెట్ 2024 హాల్‌ టిక్కెట్ల కోసం ఈ లింకును ప్రెస్ చేయండి.. https://polycetap.nic.in/Default.aspx