Today OTT Releases: ప్రతి వారం సరికొత్త కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో తెగ సందడి చేస్తుంటాయి. ఈ ఓటీటీ సినిమాల కోసమే ఎదురుచూసే మూవీ లవర్స్‌కు ఎవ్రీ వీక్ పండుగ అనే చెప్పాలి. అలా ఈ వారం కూడా పండగలాగే 17కిపైగా సినిమాలు ఓటీటీల్లోకి వచ్చాయి.

అయితే, వీటిలో ఇవాళ ఒక్క శుక్రవారం అంటే ఏప్రిల్ 26న సినిమాలు, వెబ్ సిరీసులు కలిపి ఏకంగా 13 స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో చాలా వరకు డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కినవే ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఎక్కువగా చూడాల్సిన సినిమాలు మాత్రం మూడు మాత్రమే ఉన్నాయి. మరి అవేంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం.

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ

క్రాక్ (అమీ జాక్సన్ నటించిన హిందీ మూవీ)- ఏప్రిల్ 26

థ్యాంక్యూ.. గుడ్ నెట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఏప్రిల్ 26

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

టిల్లు స్క్వేర్ (తెలుగు మూవీ)- ఏప్రిల్ 26

లా పతా లేడీస్ (హిందీ సినిమా)- ఏప్రిల్ 26

డాంజె (హిందీ సినిమా)- ఏప్రిల్ 26

గుడ్ బై ఎర్త్ (కొరియన్ సిరీస్)- ఏప్రిల్ 26

ది అసుంత కేస్ (స్పానిష్ సిరీస్)- ఏప్రిల్ 26

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ఫ్యామిలీ స్టార్ (తెలుగు సినిమా)- ఏప్రిల్ 26

యోధ (హిందీ సినిమా)- ఏప్రిల్ 26

సాయెన్ (ఇంగ్లీష్-హిందీ సినిమా)- ఏప్రిల్ 26

చుండూరు పోలీస్ స్టేషన్ (నాయట్టు తెలుగు డబ్బింగ్ సినిమా)- ఆహా ఓటీటీ- ఏప్రిల్ 26

ది బీ కీపర్ (ఇంగ్లీష్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఏప్రిల్ 26

కుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ సినిమా)- బుక్ మై షో ఓటీటీ- ఏప్రిల్ 26

మిస్ కూకూడని 3 సినిమాలు

ఇలా ఇవాళ ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన టిల్లు స్క్వేర్ సినిమాతోపాటు యావరేజ్‌ టాక్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ మూవీని తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా చూడాల్సిందే. ఇక హిందీలో కామెడీ ఎంటర్టైనర్‌గా వచ్చిన లా పతా లేడీస్ సినిమాను సబ్ టైటిల్స్‌తో అయిన చూడాలి.

మరో ఐదు సినిమాలు

ఎందుకంటే అమీర్ ఖాన్ నిర్మించిన ఈ సినిమాలో పెళ్లి చేసుకున్న భార్య మిస్ అయితే ఆమె స్థానంలో మరో అమ్మాయిని తీసుకురావడం వంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కింది. ఈ వీకెండ్‌కు మంచి ఎంటర్టైన్‌మెంట్ కావాలంటే ఈ సినిమాను కూడా యాడ్ చేసుకోవాల్సింది. 

అలాగే మలయాళంలో క్రైమ్ థ్రిల్లర్ గా బాగా హిట్ అయిన నాయట్టు సినిమాను తెలుగులో ఆహాలో చుండూరు పోలీస్ స్టేషన్ పేరుతో స్ట్రీమింగ్ అవుతోంది. వీటితోపాటు క్రాక్, డాంజె, యోధ, సాయెన్, ది బీ కీపర్ కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలే.

టిల్లు స్క్వేర్ ఓటీటీ

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన తొలి సినిమా టిల్లు స్క్వేర్. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఫ్యామిలీ స్టార్ ఓటీటీ

విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జోడీ కట్టిన మూవీ ఫ్యామిలీ స్టార్. గీత గోవిందం తర్వాత పరశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ, థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మాత్రం యావరేజ్‌గా నిలిచింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది.

యోధ ఓటీటీ

ముద్దుగుమ్మ రాశీ ఖన్నా, బాలీవుడ్ హాట్ బ్యూటి దిశా పటానీతోపాటు సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ యోధ. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్‌గా చేస్తే.. కల్కి భామ దిశా విలన్‌గా అలరించింది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది.