Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 22nd April Episode) పెళ్లిమండపంలో స్పృహ తప్పి పడిపోయిన భాగమతిని హాస్పిటల్లో చేరుస్తారు. భాగీకి పెళ్లయిందని తెలుసుకుని కరుణ హాస్పిటల్​కి వస్తుంది. స్పృహలోకి వచ్చిన భాగీ తనకేమైంది, ఎక్కడున్నానని అడుగుతుంది. కళ్లు తిరిగి పడిపోతే హాస్పిటల్​కి తీసుకొచ్చామని రామ్మూర్తి చెబుతాడు.

దిమాక్ కరాబైందా

అసలు నేనెప్పుడు పడిపోయా అంటుంది భాగీ. అమర్​, మనోహరిల పెళ్లి గుర్తొచ్చి వాళ్లకి పెళ్లి జరిగిందా, ఆగిపోయిందా అని అడుగుతుంది. జరిగిపోయింది కదమ్మా అని రామ్మూర్తి అనగానే.. పిల్లలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయానే అని భాగమతి బాధపడుతుంది. భాగమతి మాటలు విని మంగళ, రామ్మూర్తి, కరుణ ఆశ్చర్యపోతారు. అసలేమైందే నీకు.. దిమాక్​ కరాబైందా అని అడుగుతుంది కరుణ. తను ఓడిపోయానని కరుణ అనుకుంటుందని పసిపిల్లలు కష్టాల్లో ఉంటే చూడలేక అలా చేశానంటుంది భాగీ.

నువ్వేమైనా మథర్​ థెరిస్సానా అనాధపిల్లల్ని ఆదుకోడానికి అంటుంది మంగళ. నోర్మూయ్​ అని మంగళను ఆపుతాడు రామ్మూర్తి. పెళ్లి జరగాలని దేవుడు రాసిపెడితే మనం మాత్రం ఏం చేయగలం అంటుంది భాగీ. దేవుడేంటి.. నువ్వే బలవంతంగా రాసుకున్నావ్ అంటున్న మంగళతో నేను రాయడమేంటి? ఎవరు ఎవరికి అనేది ముందే రాసిపెట్టి ఉంటుంది. ఆయన ఆమెకేనని రాసిపెట్టి ఉంది అంటుంది మిస్సమ్మ. పెళ్లి జరగడంలో నీ ప్రమేయం ఏంలేదా? అని అడుగుతుంది మంగళ.

ఎవరి పెళ్లి గురించి

ఆ పెళ్లి జరగడంలో నా ప్రమేయం ఏముంది? చివరివరకు ఆ పెళ్లి ఆపడానికి చాలా ప్రయత్నించా అంటుంది. అసలు నువ్వు ఎవరి పెళ్లి గురించి మాట్లాడుతున్నావ్​ అని కరుణ అడగడంతో.. మనోహరి, అమర్​ పెళ్లి గురించి అంటుంది భాగీ. అమరేంద్రగారితో నీకు పెళ్లయిందంటుంటే​ వాళ్లెవరికో పెళ్లయిందంటావేంటి? అని అడుగుతుంది కరుణ. విషయం ఒప్పుకోకుండా వాదిస్తున్న భాగీతో పెళ్లి కాకపోతే నీ మెడలో ఉంది ఏంటి? అని అడుగుతుంది.

తన మెడలో తాళిని చూసి ఆశ్చర్యపోతుంది భాగీ. ఇప్పుడు చెప్పు మండపంలో పెళ్లి ఎవరికైంది అనిఅడుగుతుంది కరుణ. మళ్లీ స్పృహ కోల్పోతుంది భాగీ. మనోహరి స్థానంలో కూర్చుని పెళ్లి చేసుకుని ఎందుకు చేశావో చెప్పమంటే కళ్లు తిరిగి పడిపోయి.. మళ్లీ ఇప్పుడు లేచి ఏం జరిగిందో చెప్పకుండా మళ్లీ పడిపోయిందేంటి అనుకుంటుంది మంగళ.

అడుగు పెట్టేలా లేదు

అమర్ ఇంటికి పంతులు వస్తాడు. ఎందుకు పంతులుగారు వచ్చారు అని గుప్తని అడుగుతుంది అరుంధతి. అసలు ఆయన మళ్లీ పెళ్లి చేసుకోడానికి కారణం పూజారులే అంటుంది. పంతులుని కూర్చోబెట్టి మీరేమో మా ఇంటికి మళ్లీ మా అరుంధతే కోడలుగా వస్తుంది, మమ్మల్ని బాగా చూసుకుంటుంది అన్నారు, కానీ పరిస్థితులు చూస్తుంటే మిస్సమ్మ అసలు ఇంట్లో అడుగుపెట్టేలా లేదు అంటుంది నిర్మల. ఈ పెళ్లి జరగాలనేది దైవ నిర్ణయం, మిగతా పనులు కూడా శాస్ర్తప్రకారం చేయించండి అంటారు పంతులు.

మిస్సమ్మ ఇంకా హాస్పిటల్లోనే ఉందని, అసలు అమర్ ఎక్కడున్నాడో తెలియదని చెబుతాడు శివరాం. తెలిసి చేసుకున్నా, తెలియక చేసుకున్నా వారికి పెళ్లి జరిగింది. కడదాకా కలిసి నడవాల్సిందే. లేకుండా కీడు జరిగే అవకాశం ఉంది అని చెబుతాడు పంతులు.

ఏం చేయనుంది

అరుంధతి చేసిన పనికి భాగమతి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోబోతోంది? మిస్సమ్మపై పగతీర్చుకోడానికి మనోహరి ఏం చేయనుంది? అనే విషయాలు తెలియాలంటే ఏప్రిల్ 27న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్​ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!