MS Dhoni latest news : క్రికెట్​ అభిమానులను, ధోనీ ఫ్యాన్స్​ని షాక్​ గురి చేసే ఓ ఘటన ఇప్పుడు వార్తలకెక్కింది. ధోనీ రాంచీలో చిక్కుకుపోయాడంటూ, బయపడటానికి డబ్బులు కావాలంటూ కొందరు స్కామ్​ చేయడం.. అందరిని ఆందోళనకు గురిచేస్తోంది!

ఇదీ జరిగింది..

ఇటీవలి కాలంలో స్కామ్​లు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రముఖుల పేర్లు వాడుకుని చాలా మంది ఆన్​లైన్​లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ధోనీ విషయంలో కూడా ఇదే జరిగింది!

“హాయ్​. నేను ఎంఎస్​ ధోనీ. నా ప్రైవేట్​ అకౌంట్​ నుంచి నేను నీకు మెసేజ్​ చేస్తున్నాను. నేను రాంచీ శివారు ప్రాంతంలో చిక్కుకుపోయాను. నా వాలెట్​ మర్చిపోయాను. నాకు రూ. 600 ఫోన్​పే చేయగలవా? బస్సులో ఇంటికి వెళ్లడానికి నాకు డబ్బులు కావాలి. ఇంటికి తిరిగి వెళ్లగానే నీకు డబ్బులు ఇచ్చేస్తాను,” అని కొందరికి మెసేజ్​లు వెళుతున్నాయి. ధోనీ ఫొటోను ఒ పొలానికి అతకించి పంపుతున్నారు. అకౌంట్​ పేరు ఎంఎస్​ ధోనీ- మహీ77ఐ2 గా ఉంది.

Latest scam alert : కానీ ఇది ఒక పెద్ద స్కామ్​. మెసేజ్​ వచ్చిన అకౌంట్​ పేరు ఎంఎస్​ ధోనీ- మహీ77ఐ2. కానీ టీమిండియా మాజీ కెప్టెన్​ ఎంఎస్​ ధోనీ అకౌంట్​ పేరు మహీ7781.

ఈ పోస్ట్​ వెంటనే వైరల్​గా మారింది. ఇప్పటివరకు సోషల్​ మీడియాలో ఈ పోస్ట్​కు 2లక్షలకుపైగా వ్యూస్​ వచ్చాయి. ఆన్​లైన్​ మోసాల పట్ల చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఓవైపు డీప్​ఫేక్​ వీడియోలు, మరోవైపు ఆన్​లైన్​ స్కామ్​లు.. అటు ప్రజలతో పాటు ఇటు ప్రముఖులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సామాన్యులు ఈ స్కామ్​లకు భారీ మొత్తంలో డబ్బులు కోల్పోతున్నారు. అప్రమత్తంగా ఉండాలని, ఏం చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నా.. ప్రజలు మోసపోతున్నారు. స్కామర్లు కూడా రోజుకో విధంగా స్కామ్​ చేస్తున్నారు. లేటెస్ట్​ టెక్నాలజీలు వాడుకుని.. రెచ్చిపోతున్నారు.

MS Dhoni scam : ఆన్​లైన్​ స్కామ్స్​ సాధారణ విషయంగా మారిపోతున్నాయని నిపుణులు అంటున్నారు. కానీ స్కామ్​ అని తెలుసుకోవడానికి కొన్ని విధానాలు ఉన్నాయని చెబుతున్నారు. యూజర్​ ఐడీలో స్వల్పంగా మార్పు ఉంటుందని, తద్వారా స్కామ్​ని పట్టుకోవచ్చని అంటున్నారు. కానీ చాల మంది ఇవేవీ చూడకుండానే.. ముందుకు వెళిపోయి, ఆ తర్వాత అది స్కామ్​ అని తెలుసుకుని బాధపడుతుంటారు.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన పోస్ట్​ని ఇక్కడ చూడండి :