AP IAS Committee: ఎన్నికల సంఘం EC Orders ఆదేశాలకు విరుద్ధంగా ఏపీ సచివాలయంలో గురువారం ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశాన్ని తల పెట్టడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల కోడ్ Election Code అమల్లో ఉండగా రాజకీయ పార్టీలకు లబ్ది చేకూర్చే లక్ష్యంతో పదోన్నతుల్లో రిజర్వేషన్ల అంశాన్ని వాడుకుంటున్నారని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్‌ IAS Officers అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి తాము కోరుకున్న విధంగా తీర్మానాలు చేసేలా పావులు కదుపుతున్నారని సచివాలయ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మీ నేతృత్వంలో ప్రద్యుమ్న, హర్షవర్ధన్‌లు ఏక పక్షంగా వ్యవహరిస్తున్నారని, జిఏడి సర్వీసెస్‌ నేతృత్వంలో ఏర్పాటు కావాల్సిన కమిటీలో పోలా భాస్కర్‌ను ఉద్దేశ పూర్వకంగా తప్పించారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ ప్రయోజనాలే Political Benefits లక్ష్యంగా IAS కమిటీ సమావేశాలు జరుగుతున్నాయని, ఏప్రిల్ నెలాఖరులోగా రిపోర్టును సిఎస్‌కు సమర్పించాలనే లక్ష్యంతో గురువారం భేటీ ఏర్పాటు చేశారని ఆరోపిస్తున్నారు. ఏప్రిల్ 19న ఎన్నికల సంఘం పదోన్నతుల్లో రిజర్వేషన్ల వ్యవహారంపై ఎన్నికల సంఘం అదపు సీఈఓ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈసీ ఆదేశాలకు భిన్నంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ సచివాలయంలో ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల Promotions వ్యవహారంపై ఈ నెల 18న కూడా ఐఏఎస్‌ IAS Officers అధికారుల కమిటీ భేటీ అయ్యారు. వీలైనంత త్వరగా కమిటీ నివేదికను తమకు అనుకూలంగా అమోదింప చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఎస్సీ,ఎస్టీ ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. Election Code ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఉద్యోగుల చీలిక తీసుకొచ్చి కొందరికి రాజకీయ లబ్ది చేకూర్చేలా కమిటీ పావులు కదుపుతోందని ఆరోపిస్తున్నారు.

పదోన్నతులలో రిజర్వేషన్ల అమలు కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఐఏఎస్‌ అధికారులపై ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేసి కమిటీ నివేదికకు ఎన్నికలకు ముందే అమోద ముద్ర వేయించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినా కమిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, ఉద్యోగుల పదోన్నతుల వ్యవహారంపై నష్టపోయే ఉద్యోగులతో చర్చలు జరపాలని తమకు సూచించలేదని ఐఏఎస్‌ అధికారులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఉద్యోగులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఉద్యోగుల ఫిర్యాదులతో.. ప్రస్తుతం అమలులో ఉన్న సర్వీస్ రూల్స్ ప్రకారం నడుచుకోవాలని ఎలక్షన్ కమిషన్ చెప్పిందని చెబుతున్నారు. ఈసీ ఆదేశాలకు భిన్నంగా మళ్లీ కమిటీ సమావేశాలు నిర్వహించడం కుట్రలో భాగమేనని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

ఎమ్మెల్వో కమిటీని నివేదికను సవాలు చేస్తూ ఐఏఎస్‌లకు తప్ప విధానపరమైన నిర‌్ణయాలు తీసుకునే అధికారం లేదని అభ్యంతరం చెబితే, తమ చెప్పు చేతల్లో ఉండే అధికారులతో నివేదికలకు అమోదం తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ప్రభుత్వం ముగింపు పలికేందుకు కుట్రలు చేస్తోందని ఏపీ సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల్లో లబ్ది పొందడానికే కొందరు ఉద్యోగ సంఘాల నాయకులు ఈ తరహా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.