posted on Apr 24, 2024 3:02PM

వైసీపీలో ఇప్పుడు కొత్త ఏడుపు మొదలైంది. తెలుగుదేశం పార్టీ తరఫున గుంటూరు పార్లమెంట్ స్థానానికి పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్‌కి వేల కోట్లలో వున్న ఆస్తులను చూసి వైసీపీ వర్గాలు కుళ్ళుకు చస్తున్నాయి. పెమ్మసానికి ఇన్ని ఆస్తులు వున్నాయి.. అన్ని ఆస్తులు వున్నాయి అని వైసీపీ మీడియాలో ఏవేవో కట్టుకథలు వండి వార్చుతున్నారు. అన్ని ఆస్తులు వుండటం వల్లే చంద్రబాబుకు ఎన్నో కోట్లు ఇచ్చి టిక్కెట్ కొనుక్కున్నారనే ప్రచారం మొదలుపెట్టారు. ఈ చెత్త ప్రచారాన్ని పెమ్మసాని చంద్రశేఖర్ విజయవంతంగా తిప్పికొడుతున్నారు. భగవంతుడు తనకు చిన్నతనంలోనే ఎంతో సంపద వచ్చేలా అనుగ్రహించారని, తాను వైసీపీ నాయకుల మాదిరిగా అడ్డదారుల్లో డబ్బు సంపాదించలేదని కౌంటర్ ఇస్తున్నారు. తాను వైసీపీ నాయకుల తరహాలో డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, తన మాతృభూమికి సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని వైసీపీ నాయకుల కర్ణభేరులు బద్దలయ్యేలా చాటుతున్నారు. 

చంద్రబాబుకు డబ్బిచ్చి టిక్కెట్లు కొనుకున్నారంటే ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులకు కర్రుకాల్చి వాత పెట్టేలాంటి ఫ్లాష్‌బ్యాక్‌ని పెమ్మసాని రివీల్ చేశారు. 2019 ఎన్నికల సందర్భంగా పెమ్మసానిని రాజకీయాల్లోకి రప్పించడానికి జగన్ తీవ్రంగా ప్రయత్నించాడట.. ఎమ్మెల్యే, ఎంపీ ఏ సీటు కావాలంటే ఆ సీటుకి టిక్కెట్ ఇస్తాం.. ఎలక్షన్లో పోటీ చేయడం ఇష్టం లేదంటే ఎమ్మెల్సీగానో, రాజ్యసభ సభ్యుడిగానో ఉంటానన్నా ఓకే… మీరు మా పార్టీలో చేరితే చాలు అంటే భారీ స్థాయిలో రాయబారాలు నడిపారట. వీళ్ళు ఎంత కాళ్ళావేళ్ళఆ పడినప్పటికీ, వైసీపీ విధానాలు, వ్యక్తుల పద్ధతులు నచ్చని పెమ్మసాని వైసీపీకి నో చెప్పారట. అప్పుడు తమ పార్టీలో చేరాలంటూ కాళ్ళావేళ్ళా పడిన వైసీపీ నాయకులు ఇప్పుడు తాను టీడీపీలో చేరితే ఇష్టమొచ్చిన ప్రచారాలు చేయడం వాళ్ళ సంస్కారాన్ని బహిర్గతం చేస్తోందని పెమ్మసాని అంటున్నారు.

టీడీపీకి ప్రస్తుత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఈసారి ఎన్నికలలో పోటీ చేయకుండా తప్పుకున్నారు. ఇక్కడ నుంచి కొత్తగా పోటీకి దిగిన టీడీపి అభ్యర్థిని ఒక ఆట ఆడుకోవాలని అనుకున్న వైసీపీ నాయకులు పెమ్మసాని దూకుడు చూసి బిత్తరపోతున్నారు. పెమ్మసాని ఆడించేవాడే తప్ప, వేరేవాళ్ళు ఆడుకునేవారు కాదని అర్థమై నీళ్ళు నములుతున్నారు. ఎన్నారై కదా, ఏసీ కార్లో వచ్చి, జనానికి చేతులు ఊపి వెళ్ళిపోతాళ్ళే అనుకుంటే, నియోజగకవర్గంలోని గడపగడపనూ పెమ్మసాని సందర్శిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి కిలారి రోశయ్య కంటే ప్రచారంలో చాలా ముందున్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అనేది  డిసైట్ అయిపోయిందని భావిస్తున్నారు.