Wednesday Motivation: ఆడవాళ్ళని అందంతో అంచనా వేయడం ఎప్పుడు ఆగిపోతుందో… స్త్రీకి అందమే కొలమానం కాదు. వారిలోనూ ఎన్నో తెలివితేటలు, ప్రతిభా ఉంటాయి. ఆ ప్రతిభను, ఆ తెలివితేటలను గుర్తిస్తే… అందం వాటి ముందు ఎందుకు పనికిరాని అంశమే అవుతుంది. అందానికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. కానీ ప్రతిభకు, తెలివితేటలకు ముగింపు అనేది ఉండదు. 40 ఏళ్లు దాటితే ప్రతి మనిషి ముఖం మీద ముడతలు రావాల్సిందే. రాకుండా అడ్డుకోవడం ఎవరి తరం కాదు. కానీ ప్రతిభ… వయసు పెరిగే కొద్దీ అనుభవాలతో జతపడి మరింతగా దృఢపడుతుంది. అందం గొప్పదా? టాలెంట్ గొప్పదా? అని అడిగితే… బుర్ర ఉన్న వారెవరైనా టాలెంటే గొప్పదని ఒప్పుకుంటారు.