TS Inter Marks Memo Download : తెలంగాణ ఇంటర్ ఫలితాలు(TS Inter Results 2024) విడుదలయ్యాయి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 9.81 లక్షల మంది హాజరవ్వగా…ఇంటర్ ఫస్టియర్ లో 60.01 శాతం , సెకండియర్ లో 64.19 శాతం ఉత్తీర్ణత సాధించారు. తాజాగా ఇంటర్ బోర్డు విద్యార్థుల మార్కుల మెమోలను(TS Inter marks Memo) వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://results.cgg.gov.in/bieresultlivebti.do పై క్లిక్ చేసి మెమోలు పొందవచ్చు.

ఇంటర్ మార్కుల మెమోలు డౌన్ లోడ్ చేసుకోవడం ఎలా?(TS Inter Marks Memo Download)

Step 1 : విద్యార్థులు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ https://tsbie.cgg.gov.in/ పై క్లిక్ చేయండి.

Step 2 : ఈ పేజీలో ‘Results’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 3 : రిజల్ట్స్ మెమో డౌన్ లోడ్ పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఇయర్, కేటగిరి ఎంపిక చేసి, విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ‘గెట్ మెమో’ పై క్లిక్ చేయండి.

Step 4 : ఆ తర్వాత మీ మార్కుల మెమో స్క్రిన్ పై డిస్ ప్లే అవుతుంది.

Step 5 : మార్కుల మెమోలో విద్యార్థి ఫొటో, పేరు, వివరాలు, తల్లిదండ్రుల పేర్లు, మార్కులు, గ్రేడ్ అంటాయి.

Step 6 : తదుపరి అవసరాల కోసం మార్కుల మెమోను డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి.

విద్యార్థులు మార్కుల మెమో డౌన్ లోడ్ లో ఏదైనా సమస్య వస్తే…ఇంటర్ బోర్డు హెల్ప్ డెస్క్ నెంబర్ 040-24655027ను సంప్రదించవచ్చు.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలకు(TS Inter 1st Year Results) మొత్తం 4,78,723మంది హాజరయ్యారు. వీరిలో రెగ్యులర్‌ ఇంటర్‌ విద్యార్ధులు 4,30,413 మంది, ఒకేషనల్ విద్యార్థులు 48,310 మంది ఉన్నారు. మొదటి సంవత్సరంలో మొత్తం 61.06 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ విద్యార్థుల్లో 50.57శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ జనరల్, ఒకేషనల్ కలిపి మొదటి సంవత్సరంలో 2,87,261 మంది ఉత్తీర్ణులుయ్యారు. ఉత్తీర్ణతా శాతం 60.01శాతంగా ఉంది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో జనరల్ విభాగంలో 69.46శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఒకేషనల్‌ విద్యార్థుల్లో 63.86 శాతం ఉత్తీర్ణత సాధించారు. రెండు విభాగాల్లో కలిపి 64.19 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు(TS Inter 2nd Year Results) జనరల్ విభాగంలో 4,01,445మంది హాజరయ్యారు. మరో 54,228మంది ప్రైవేట్‌గా పరీక్షలు రాశారు. ఒకేషనల్ కోర్సుల్లో 42,723మంది హాజరయ్యారు.

ఇంటర్ సెకండియర్‌లో 1,77,109మంది 75 శాతం పైగా మార్కులతో ఏ గ్రేడ్ సాధించారు. 68,378మంది 60 శాతానికి పైగా మార్కులతో బి గ్రేడ్ సాధించారు. 25,478మంది 50 శాతం మార్కులతో సి గ్రేడ్ దక్కించుకున్నారు. డి గ్రేడ్‌లో 7,891మంది ఉన్నారు. ఇంటర్ సెకండియర్‌లో మొత్తం 2,78,856మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రైవేట్‌గా పరీక్షలు రాసిన 14,740మంది కూడా ఉత్తీర్ణత సాధించారు.