ఇప్పుడు మనం ఆధునిక జీవన విధానంలో జీవిస్తున్నాం. అందుకే చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. వ్యాయామం దగ్గర్నుంచి తిండి వరకూ అన్నీ చూస్తుంటారు. కానీ ఇవన్నీ చేయకపోయినా 5 నిమిషాల నియమం పాటిస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు. దానిని ఎలా ఫాలో కావాలని ఆలోచిస్తున్నారా?

నేడు 95 శాతం మంది ప్రజలు శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఆరోగ్యంతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మధుమేహం, గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైన వ్యాధులకు నిశ్చల జీవనశైలి ప్రధాన కారణాలలో ఒకటి. దీంతో మరణాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీన్ని ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తున్నారా? సులభంగా పరిష్కరించవచ్చు. కేవలం 5 నిమిషాల రూల్ ఫాలో అవ్వండి.

కొందరిపై పరిశోధన

ఈ నిశ్చల జీవనశైలి నుంచి బయటపడేందుకు ఒక మంచి మార్గం ఉందని కొలంబియా యూనివర్సిటీ మెడికల్ ప్రొఫెసర్ చెప్పారు. దీనికి సంబంధించి అధ్యయనం కూడా చేశారు. అందులో పరిశోధనా బృందం 11 మంది వాలంటీర్లను నియమించింది. వారిని 8 గంటల పాటు కుర్చీల్లో కూర్చోబెట్టి ల్యాప్‌టాప్‌లలో పని చేయడానికి, చదవడానికి, వారి ఫోన్‌లను ఉపయోగించుకునేలా చేసింది. వీరంతా 40 నుంచి 60 ఏళ్లలోపు వారే.

వీరిని ఇలా కొన్ని రోజులపాటు పరిశీలించారు. మొదటి కొన్నిరోజులు ఎనిమిది గంటల పాటు నడవలేదు. కూర్చొని వారి పని వారు చేసుకున్నారు. తరువాతి రోజుల్లో వారు ప్రతి అరగంటకు ఒక నిమిషం, ప్రతి గంటకు ఒక నిమిషం, ప్రతి అరగంటకు ఐదు నిమిషాలు, చివరకు ప్రతి గంటకు ఐదు నిమిషాలు.. ఇలా పరిశోధన చేశారు.

అరగంటకు 5 నిమిషాలు

ప్రతి అరగంటకు 5 నిమిషాలు నడవడం వల్ల ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా ఇది రక్తంలో గ్లూకోజ్, రక్తపోటు రెండింటినీ గణనీయంగా తగ్గిస్తుంది. అలాగే కార్డియోమెటబోలిక్ ప్రమాద కారకాలు ప్రతిసారీ తగ్గుతాయి. రోజంతా కూర్చోవడంతో పోలిస్తే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను 58 శాతం తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

అదేవిధంగా వారి మానసిక స్థితి, అలసట, పనితీరు స్థాయిలను పరిశీలించినప్పుడు, వారు అలసటలో గణనీయమైన తగ్గింపును, నడకతో మానసిక స్థితి మెరుగుపడినట్లు నివేదించారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ కనీసం 10,000 అడుగులు క్రమం తప్పకుండా నడిచే వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారు. ముఖ్యంగా వ్యాయామం చేయని వారి కంటే ఈ మార్గంలో నడిచే వ్యక్తులు కనీసం ఐదేళ్లు ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి జర్మనీలో పది వేల మందిపై సర్వే నిర్వహించింది.

దీన్ని ఎలా చేయవచ్చు?

రోజంతా కూర్చోవడానికి బదులు నడవడానికి కారణాలను కనుగొనండి.

అప్పుడప్పుడూ లేచి నీళ్లు తాగాలి.

ప్రతిరోజూ మెట్లు ఎక్కి దిగండి. కారణం ఇది మీ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.

ఫోన్‌లో మాట్లాడుతూ నడవడం, మాట్లాడటం ప్రాక్టీస్ చేయండి

ఇంట్లో కుర్చీలో కూర్చోకుండా ఉండటం చాలా మంచిది.

ముఖ్యంగా మీరు ఇంటి నుండి పని చేస్తే పరుపుపై ​​కూర్చోవద్దు.